Waltair Veerayya Story leaked: వాల్తేరు వీరయ్య స్టోరీ లీక్... మాస్ మహారాజా ముందు మెగాస్టార్ తేలిపోయాడుగా?
వాల్తేరు వీరయ్య మూవీ నుండి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. మాస్ మహారాజ్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య స్టోరీ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Waltair Veerayya
వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ రోల్ పై మొదటి నుండి సగటు సినిమా లవర్ కి ఆసక్తి ఉంది. స్టార్ డమ్ సొంతం చేసుకున్న రవితేజకు ప్రాధాన్యత లేని పాత్ర ఇవ్వలేరు. అలా అని మెగాస్టార్(Chiranjeevi) ని డామినేట్ చేస్తే బాగోదు. అందులోనూ ఇది క్యామియో రోల్ కాదు. కథలో కీలకమైన పూర్తి స్థాయి పాత్ర.
Waltair Veerayya
ఈ క్రమంలో డిసెంబర్ 12న విడుదల చేసిన రవితేజ(Raviteja) ఫస్ట్ లుక్ టీజర్ తో ఆయన పాత్రపై అవగాహన వచ్చింది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సాగర్ గా ఒక పవర్ ఫుల్ రోల్ లో రవితేజ కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ తో రవితేజ ఎంట్రీ సీన్ రివీల్ చేశారు అనిపిస్తుంది.
Waltair Veerayya
కాగా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ చూశాక వాల్తేరు వీరయ్య కథపై పూర్తి అవగాహన వచ్చింది. ఆ చిత్ర కథ ఇదే అంటున్నారు. సదరు ఊహాగానాల ప్రకారం... వాల్తేరు వీరయ్యకు వైజాగ్ సాగరతీరంలో ఎదురుండదు. అతడు మంచోళ్ళకు మంచోడు చెడ్డోళ్లకు చెడ్డోడు. తన వాళ్ళ జోలికి వస్తే ఎవడికైనా చుక్కలు చూపిస్తాడు.
Waltair Veerayya
మాఫియా నుండి వైజాగ్ గుండాల వరకు వాల్తేరు వీరయ్య అంటే హడల్. తన జనానికి వీరయ్య దేవుడు. పేద ప్రజల కోసం వాల్తేరు వీరయ్య ఎలాంటి పనులైనా చేస్తాడు. సాగర తీరంలో ఎదురు లేకుండా దూసుకెళుతున్న వాల్తేరు వీరయ్యను కట్టడి చేసేందుకు ఒకడు దిగుతాడు. వాడే విక్రమ్ సాగర్ ఏసీపీ.
Waltair Veerayya
విక్రమ్ సాగర్ వైజాగ్ లో ఛార్జ్ తీసుకున్నాక ఇదివరలా పరిస్థితులు ఉండవు. వాల్తేరు వీరయ్య మనుషులకు నీళ్లు తాగించిన విక్రమ్ సాగర్ వైజాగ్ లో నా మాటే చెల్లాలి అంటాడు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్యకు కోపం తెప్పించాలి. అతన్ని ఏమీ చేయాలేని నిస్సహాయ స్థితిలో చూడాలి అనుకుంటాడు.
వాల్తేరు వీరయ్యను విక్రమ్ సాగర్ టార్గెట్ చేయడానికి... ఏసిపీగా వైజాగ్ లో దిగడానికి పెద్ద కథే ఉంటుంది. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) కోసం వచ్చిన విక్రమ్ సాగర్ లక్ష్యం నెరవేరిందా? వాల్తేరు వీరయ్యకు-విక్రమ్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేదే కథలో అసలు ట్విస్ట్... ఇది టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వాల్తేరు వీరయ్య మూవీ స్టోరీ.
ప్రచారం అవుతున్న ఈ కథలో వాస్తవం ఏమిటనేది మరో నెల రోజుల్లో తేలిపోనుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. కాగా చిరంజీవి ఫస్ట్ లుక్ టీజర్ కంటే రవితేజ టీజర్ చాలా బాగుందని నెటిజెన్స్ అభిప్రాయం.