- Home
- Entertainment
- స్లీవ్‌లెస్ డ్రెస్‌లో శివాత్మిక అందాలు అదరహో.. మూడేళ్ల తర్వాత వస్తుండటంతో ఎమోషనల్..
స్లీవ్‌లెస్ డ్రెస్‌లో శివాత్మిక అందాలు అదరహో.. మూడేళ్ల తర్వాత వస్తుండటంతో ఎమోషనల్..
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ నేచురల్ అందాలతో కనువిందు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న ఈ తెలుగు అందం ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని అలరించడానికి వస్తోంది.

శివాత్మిక రాజశేఖర్ తాజాగా గ్లామర్ తో కనువిందు చేసింది. గోదుమ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసింది. కొంటె నవ్వులు, చిలిపి పోజులతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
ప్రస్తుతం శివాత్మిక `ఆకాశం` అనే చిత్రంలో నటించింది. తమిళం రూపొందిన ఈ సినిమా తెలుగులో `ఆకాశం` పేరుతో విడుదల చేస్తున్నారు. శుక్రవారం(నవంబర్ 4)న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాత్మిక మాట్లాడింది.
`దొరసాని` తర్వాత ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం చాలా ఎమోషనల్‌గా ఉందని చెప్పింది శివాత్మిక. ఇందులో మీనాక్షి పాత్రలో కనిపించబోతున్నానని, చాలా ఫీల్‌గుడ్ మూవీ అని, అందరి హృదయాలను హత్తులకునేలా ఉంటుందని, లవ్, ట్రావెలింగ్ కట్టిపడేస్తాయని, ఓ కొత్త తరహా లవ్ స్టోరీ చిత్రమిదని పేర్కొంది శివాత్మిక.
థియేటర్‌లో సినిమా చూస్తే విజువల్‌గా ఆకట్టుకుంటుంది, అదే సమయంలో ఎమోషనల్‌గానూ కనెక్ట్ అవుతుందని చెప్పింది. తనకిది గొప్ప అనుభూతినిచ్చిన చిత్రమిది అని, ఎంతో నమ్మకంతో ఉన్నానని, తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నట్టు చెప్పింది.
హీరో అశోక్ సెల్వన్ చెబుతూ, నేను చేసిన `నిన్నలా నిన్నలా` సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించారు. ఇప్పుడు `ఆకాశం`తో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. దీనికి కూడా తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తారని భావిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పటికీ కావాలి. నేను తమిళంలో చేసిన `ఓ మై కడవులే` సినిమా చూసి మహేష్ వంటి పెద్ద స్టార్ ట్వీట్ చేసినప్పుడు నాకెంతో స్పెషల్‌గా అనిపించింది.
అలాగే ఈ సినిమాకు నానిగారు సపోర్ట్ అందించారు. ఇవన్నీ మంచి సినిమాకు మీరు అందిస్తోన్న సపోర్ట్‌ని తెలియజేస్తుంది` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీతు వర్మ, దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్, నిర్మాత సాగర్ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
మరోవైపు రాజశేఖర్ తనయ మూడేళ్ల క్రితం `దొరసాని` చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఆకాశం` సినిమాతో మెప్పించేందుకు వస్తుంది. ఇందులో ఆమె పాత్ర కాస్త ఇంటెన్స్ గా ఉండటం విశేషం. మరోవైపు సహజమైన అందాలతో ఆకట్టుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది శివాత్మిక. అందుకే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంటుంది.