- Home
- Entertainment
- డ్రగ్స్ రైడ్స్ నేపథ్యంలో హోటల్ నుంచి పారిపోయిన షైన్ టామ్ చాకో, సినిమా సీన్ ని మించే ఎస్కేప్
డ్రగ్స్ రైడ్స్ నేపథ్యంలో హోటల్ నుంచి పారిపోయిన షైన్ టామ్ చాకో, సినిమా సీన్ ని మించే ఎస్కేప్
మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. దసరా చిత్రంతో షైన్ టామ్ విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Shine Tom Chacko
మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. దసరా చిత్రంతో షైన్ టామ్ విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ మూవీలో షైన్ టామ్ చాకో క్రూరమైన స్వభావం ఉన్న వ్యక్తిగా, వుమెనైజర్ గా నటించారు. దసరా హిట్ కావడంతో ఆ తర్వాత అతడికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
shine tom
ఈ తరుణంలో షైన్ టామ్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ మలయాళీ నటి విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. విన్సీ ఆరోపణలు మలయాళీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. కేరళ ఫిలిం ఛాంబర్, అమ్మ అసోసియేషన్ కి కూడా అతడిపై కంప్లైంట్ వెళ్ళింది. దీనితో అతడిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
విన్సీ, షైన్ టామ్ కలసి సూత్రవాక్యం అనే చిత్రంలో నటించారు. ఈ వివాదానికి కొనసాగింపుగా జరిగిన పరిణాలమాలతో షైన్ టామ్ పై మరింతగా అనుమానాలు పెరుగుతున్నాయి. ఒక హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనే అనుమానాలతో నార్కోటిక్స్ బృందం రైడ్ చేశారు.
shine tom chacko
ఆ హోటల్ లో షైన్ టామ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నార్కోటిక్స్ అధికారులు రావడానికి కొద్దిసేపటి ముందు షైన్ టామ్ హోటల్ నుంచి పారిపోయాడట. సినీ స్టైల్ లో షైన్ టామ్ ఎస్కేప్ జరిగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తు కిటికీ నుంచి షైన్ టామ్ రెండవ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పారిపోయాడట. దీనితో షైన్ టామ్ కోసం నార్కోటిక్స్ అధికారులు గాలింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.