- Home
- Entertainment
- 24 గంటలు అదే పని చేస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం.. బోల్డ్ బ్యూటీ కామెంట్స్ వైరల్
24 గంటలు అదే పని చేస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం.. బోల్డ్ బ్యూటీ కామెంట్స్ వైరల్
పంజాబీ బోల్డ్ బ్యూటీ షెహనాజ్ గిల్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తరచుగా ఆమె పేరు వార్తల్లో నిలుస్తోంది. షెహనాజ్ గిల్ హిందీ బిగ్ బాస్ 13లో పాల్గొంది.

పంజాబీ బోల్డ్ బ్యూటీ షెహనాజ్ గిల్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తరచుగా ఆమె పేరు వార్తల్లో నిలుస్తోంది. షెహనాజ్ గిల్ హిందీ బిగ్ బాస్ 13లో పాల్గొంది. ఆ సీజన్ లో షెహనాజ్ గిల్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. దీనితో షెహనాజ్ క్రేజ్ పెరిగింది.
బిగ్ బాస్ తో ఊహించని గుర్తింపు రావడంతో షెహనాజ్ సోషల్ మీడియాలో దూకుడు పెంచేసింది. బోల్డ్ ఫొటో షూట్స్, గ్లామర్స్ వీడియోస్, ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్ బాస్ 13లో విజేతగా నిలిచిన నటుడు సిద్దార్థ్ శుక్లాతో క్లోజ్ రిలేషన్ కారణంగా కూడా షెహనాజ్ గిల్ వార్తల్లో నిలిచింది.
గత ఏడాది సిద్ధార్థ్ శుక్లా గుండె పోటు కారణంగా ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో సిద్దార్థ్, షెహనాజ్ రిలేషన్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి ఇంటిమేట్ గా రొమాన్స్ చేశారు.
ఆ జ్ఞాపకాల నుంచి బయట పడ్డ షెహనాజ్ ప్రస్తుతం తన వర్క్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా షెహనాజ్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన పెళ్లి గురించి హాట్ కామెంట్స్ చేసింది. ఓ అభిమాని తనని పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడు.
అతడికి షెహనాజ్ బదులిస్తూ.. నాతో పెళ్లా.. అయితే మీ బియోడేటా పంపండి. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఎంతో ఓపిక సహనం ఉండాలి. నాతో అంత ఈజీగా ఉండదు. ఎదుటి వాళ్ళు చెప్పేది నేను వినను. కానీ నేను మాత్రం 24 గంటలైనా మాట్లాడుతూనే ఉంటాను. నేను చెప్పేది ఓపిగ్గా వింటూనే ఉండాలి.
నేను చెప్పేది వినకపోయినా, నన్ను పట్టించుకోకున్నా నేను వెళ్ళిపోతాను. నన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం ఉండలేరు. అందుకే నాతో పెళ్లి లాంటి విషయాలు ఊహించుకోకండి అంటూ ఈ బోల్డ్ బ్యూటీ షాకింగ్ రిప్లై ఇచ్చింది.