- Home
- Entertainment
- ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బాగా రిచ్
ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బాగా రిచ్
ఈ ఫోటోలో కనిపిస్తున్న లేడీ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు ఈమె చిరంజీవి తో వరుసగా సినిమాలు చేసి ఓ ఊపు ఊపేశారు. ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశారు. చిరుతో బెస్ట్ జోడీ అనిపించుకున్న స్టార్ హీరోయిన్.

చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చాలా మంది హీరోయిన్లు పనిచేశారు. సావిత్రి తరం కాకుండా ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లంతా చిరుతో రొమాన్స్ చేసిన వారే. ఇప్పుడొస్తున్న హీరోయిన్లు సైతం ఆయనతో జోడీ కడుతున్నారు. ఆల్మోస్ట్ మూడు తరాల హీరోయిన్లతో ఆయన నటించారని చెప్పొచ్చు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఆమె ఎవరో తెలుసుకుందాం.
`ఖైదీ` హీరోయిన్ మాధవి
ఈ ఫోటోల్లో కనిపిస్తోన్న నటి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి. మెగాస్టార్‌తో ఆమె `ఖైదీ` చిత్రంలో నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 1983లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే చిరంజీవి కెరీర్ టర్న్ తీసుకుంది. దీనికి ముందు ఆయన దాదాపు అరవై సినిమాలు చేశారు. ఈ చిత్రంతోనే ఆయనకి స్టార్ ఇమేజ్ సొంతమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా విజయాలు అందుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు.
చిరంజీవితో వరుస హిట్ చిత్రాల్లో నటించిన మాధవి
`ఖైదీ` సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది మాధవి. ఈ మూవీ కంటే ముందే ఆమె స్టార్‌గా ఎదిగింది. కానీ కమర్షియల్‌గా బిగ్ బ్రేక్‌ని, ఆమె కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ ఇదే కావడం విశేషం. చిరు, రాధాల జోడీ కంటే ముందే చిరంజీవి, మాధవి ల కాంబినేషన్ చాలా పాపులర్. వీరిద్దరి కాంబినేషన్‌లో `ప్రాణం ఖరీదు`, `మనవూరిపాండవులు`, `కుక్క కాటుకు చెప్పు దెబ్బ`, `కోతల రాయుడు`, `అగ్ని సంస్కారం`, `ఊరికి ఇచ్చిన మాట`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `రోషగాడు`, `సింహపూరి సింహం`, `ఖైదీ`, `చట్టంతో పోరాటం`, `దొంగమొగుడు`, `బిగ్ బాస్` వంటి చిత్రాలు వచ్చాయి. ఆమె తెలుగులో ఎక్కువగా చిరుతోనే నటించడం విశేషం. వీరితోపాటు కృష్ణ, కృష్ణంరాజులతోనూ సినిమాలు చేసి విజయాలు అందుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
అమెరికాలో సెటిల్ అయిన మాధవి
`బిగ్ బాస్` తర్వాత ఆమె తెలుగులో సినిమాలు మానేశారు. తెలుగులోనే కాదు మొత్తంగా సినిమాలే మానేశారు. 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు న్యూజెర్సీ(అమెరికా)లో సెటిల్ అయ్యారు. వీరికి ఫార్మా బిజినెస్‌లు ఉన్నాయట. అయితే ఇప్పుడు మాధవి రెస్టారెంట్ బిజినెస్‌ని రన్ చేస్తున్నారట. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మాధవి ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ బాగా రిచ్ కావడం విశేషం. వందల కోట్ల ఆస్తులు ఆమె సొంతమని సమాచారం.