- Home
- Entertainment
- ఏకంగా 22 కేజీల బరువు తగ్గిన శర్వానంద్, ఎలా సాధ్యమైంది.. కూతురు పుట్టాక ఏం జరిగిందో తెలుసా ?
ఏకంగా 22 కేజీల బరువు తగ్గిన శర్వానంద్, ఎలా సాధ్యమైంది.. కూతురు పుట్టాక ఏం జరిగిందో తెలుసా ?
యంగ్ హీరో శర్వానంద్ త్వరలో బైకర్ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ 18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించబోతున్నారు. దీని కోసం శర్వా ఏకంగా 22 కేజీల బరువు తగ్గారట.

22 కేజీల బరువు తగ్గిన శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బైకర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్ యువ బైక్ రేసర్ గా నటించబోతున్నారు. ఈ మూవీ కోసం శర్వానంద్ తన కెరీర్ లోనే తొలిసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఇంతలా తన మేకోవర్ మార్చుకోవడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మైండ్ బ్లాక్ చేసే అంశం ఏంటంటే శర్వానంద్ ఏకంగా 22 కేజీల బరువు తగ్గారు.
ఆ ప్రమాదం తర్వాత శర్వానంద్ లో మార్పు
అంత బరువు తగ్గడం తనకి ఎలా సాధ్యం అయింది అనే విషయాన్ని శర్వానంద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. శర్వానంద్ కొన్నేళ్ల క్రితం 96 అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో శర్వానంద్ కి షోల్డర్ ఇంజ్యురి జరిగింది. దీనితో శర్వానంద్ కి సర్జరీ జరగడం తో కొన్ని నెలలు విశ్రాంతి అవసరం అయింది. ఆ టైంలో శర్వానంద్ బాగా బరువు పెరిగారు. ఏకంగా 90 కేజీలకు శర్వానంద్ బరువు చేరుకుంది. అలా ప్రమాదంలో గాయపడడం, బరువు పెరగడం లాంటి సంఘటనలే తనని పూర్తిగా మార్చేశాయి అని శర్వానంద్ తెలిపారు.
18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించబోతున్న శర్వా
ఆ సమయంలో చాలా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాను. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఆకలి ఎక్కువ వేయడం వల్ల ఆహారం కూడా ఎక్కువగా తినేవాడిని. దీనితో బరువు విపరీతంగా పెరుగుతూ వచ్చాను. రెండేళ్ల క్రితం నాకు బైకర్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను 18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించాలి. కాబట్టి తప్పనిసరిగా బరువు తగ్గాల్సిందే. ఈ లుక్ తో 18 ఏళ్ళ కుర్రాడిగా కనిపించడం సాధ్యం కాదు.
కూతురు పుట్టాక మారిన ఆలోచనా ధోరణి
అందుకే వర్కౌట్స్ ప్రారంభించాను. ప్రతి రోజూ తెల్లవారు జామున 4.30 గంటలకు కేబీఆర్ పార్క్ లో రన్నింగ్ చేసేవాడిని. ఆ వెంటనే జిమ్ కి వెళ్ళేవాడిని. ఇలా 8 నెలల పాటు విరామం లేకుండా కష్టపడ్డాను. అలా చేయడం వల్ల నాలో ఓపిక పెరిగింది. అన్ని విషయాలపై ఫోకస్ కూడా చేయగలిగాను. ఆ టైంలో నాకు కూతురు పుట్టింది. పాప పుట్టాక తండ్రిగా బాధ్యతలు పెరిగాక నాలో మరో మార్పు వచ్చింది. ఆలోచనా ధోరణి మారింది. ఫిట్ నెస్ అనేది సినిమాల కోసం మాత్రమే కాదు, ఫ్యామిలీ కోసం కూడా అవసరం అని తెలుసుకున్నా.
ఫుడ్ విషయంలో ఛాలెంజ్
దీనితో మరో ఛాలెంజ్ తీసుకున్నా. నేను ఫుడీని. కాబట్టి ఇకపై కావలసినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి అని నిర్ణయించుకున్నా. ఫిట్ నెస్ అనేది 70 శాతం మనం తినే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. 30 శాతం వర్కౌట్స్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవసరమైన పోషకాలు ఉండే బ్యాలెన్స్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్లు శర్వా తెలిపారు. దీనితో 2 ఏళ్ళలో 22 కేజీల బరువు తగ్గా. అంటే దాదాపు ప్రతి నెల ఒక కేజీ తగ్గుతూ వచ్చినట్లు తెలిపారు.