Shakeela: యావర్ పెద్ద ఎదవ.. ప్రశాంత్ బ్లడీ రాంగ్.. గీతూ రాయల్‌తో సహా అందరిని ఉతికి ఆరేసిన షకీలా
బిగ్ బాస్ తెలుగు 7లో ఒకప్పటి శృంగార కథానాయిక షకీలా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్బంగా హౌజ్‌మేట్స్ పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
షకీలా ఒకప్పుడు ఎన్నో వ్యాంప్ పాత్రలు చేసింది, శృంగార చిత్రాలు చేసింది. స్టార్‌గా వెలుగొందింది. కానీ ఆ తర్వాత డౌన్ అవుతూ వచ్చింది. కొన్నాళ్లపాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తాను వెండితెరపై రచ్చ చేయాలని, తానేంటో క్లీన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని తపిస్తుంది. ఇప్పటికే ఇతర భాషల్లో ఫ్యామిలీ షోస్, కుకింగ్ షోస్ చేసింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌కి వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌లో షకీలా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. షకీలా అమ్మగా పేరుతెచ్చుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. అన్నట్టుగానే ఆమె అమ్మతరహాలోనే వ్యవహరించింది. కాకపోతే కూర్చొని కబుర్లకే పరిమితమయ్యింది. అడపాదడపా ఎంటర్‌టైన్ చేసినా అది సరిపోలేదు, ఆడియెన్స్ మెచ్చలేదు. దీంతో హౌజ్ నుంచి పంపించేశారు. రెండో వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది.
అయితే ఇంత త్వరగా తాను హౌజ్ నుంచి బయటకు వస్తానని అనుకోలేదని చెప్పి నాగార్జున ముందు ఎమోషనల్ అయ్యింది. అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో అసలు విషయాలపై ఓపెన్ అయ్యింది. యాంకర్ గా వ్యవహరిస్తున్న గీతూ రాయల్ అంతే బోల్డ్ గా షకీలాని నిలదీసింది. అదే సమయంలో షకీలా సైతం ఫైర్ అయ్యింది. హౌజ్‌లో ఉన్న వారి బండారాలు, వారి నిజస్వరూపాలు బయటపెట్టింది. మొదట షకీలా రాగానే `మీరు ఆశ్రమానికి వెళ్లారా? బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్లారా? అంటూ నిలదీసింది హోస్ట్ గీతూ రాయల్. దీంతో `ఎక్స్ క్యూజ్ మీ` అంటూ షకీలా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
అయినా ఆగలేదు.. `హౌజ్‌లో మీరు శివాజీ బ్యాచా? లేక సీరియల్స్ బ్యాచా ` అని ప్రశ్నించగా, నేను చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అంటూ ఫైర్ అయ్యింది షకీలా. దీంతో ఒక్కసారిగా షో హిటెక్కింది. మీరు హౌజ్‌లో రియల్ గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అంటే నేనేమీ ప్లాన్ చేయలేదని, బిగ్ బాస్ పిలస్తే వచ్చానని చెప్పారు.
ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది షకీలా. శోభా శెట్టి మాస్క్ తో ఉందని వెల్లడించింది. అమర్ దీప్.. ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నాడని వెల్లడించింది. ప్రిన్స్ యావర్ గురించి చెబుతూ అతను పెద్ద ఎదవ అని బోల్డ్ కామెంట్ చేసింది షకీలా. జస్ట్ బాడీని పెట్టుకుని తాను హైట్స్ కి రీచ్ అవుతానని భావిస్తున్నాడని, అలా ఎదగడం చాలాకష్టమని చెప్పింది.
పల్లవి ప్రశాంత్ గురించి సైతం షాకింగ్ కామెంట్స్ చేసింది. బ్లడీ రాంగ్ యాటిట్యూడ్‌తో ఉన్నాడని వెల్లడించింది. ఫస్ట్ వచ్చిన రోజు చెప్పులు బయట తీసేసి వచ్చాడని, రెండో రోజు చెప్పులు దూరంగా పెట్టాడని, మూడో రోజు కాలు పైకెత్తాడని, నాల్గో రోజు కాలు మీద కాలేసుకుని హౌజ్‌ని ఆడిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. పాపులారిటీ అనే డ్రగ్ అతనికి ఎక్కిందని చెప్పింది.
ఇక ఆట సందీప్ ఉండాల్సిన వ్యక్తి అని, శివాజీ నిజమైన బ్రదర్ అని చెప్పింది. రతిక గురించి చెబుతూ, బ్యూటీఫుల్ స్నేక్ అని, ఐ కాంటాక్ట్ ఇస్తే దొరికిపోతానని, ఎవరితోనూ పెట్టుకోదని ఆరోపించింది. ఇక చివరగా చెబుతూ `నేను సస్తే ఈ 14 మంది రావాలా? నాకు అది కావాలి? అని చెప్పింది షకీలా. తాజాగా విడుదలైన ఈ ప్రోమో అదరగొడుతుంది. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి హాట్ కామెంట్లు, సంచలన విషయాలు చెబుతుందో చూడాలి.