- Home
- Entertainment
- చంపేస్తామని బెదిరించారు.. ఆ టైమ్‌లో పిచ్చిదాన్ని అయిపోయా.. షారూఖ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చంపేస్తామని బెదిరించారు.. ఆ టైమ్‌లో పిచ్చిదాన్ని అయిపోయా.. షారూఖ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
`రాయిస్` హీరోయిన్ మహీరా ఖాన్ ఆ సినిమా సమయంలో అనేక బెదిరింపులకు లోనయ్యింది. ఈ క్రమంలో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందట. తాజాగా అసలు రహస్యాలను బయటపెట్టిందీ బ్యూటీ.

షారూఖ్ ఖాన్ నటించిన `రాయీస్` సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా సత్తా చాటలేదు. డిజాప్పాయింట్ చేసింది.కానీ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ మహీరా ఖాన్ పాపులర్ అయ్యారు. ఆమె వివాదాస్పదంగానూ మారారు. బెదిరింపులు, ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్నాళ్లపాటు ఇబ్బందులు ఫేస్ చేసింది. తాజాగా ఆ విషయాలను బయటపెట్టింది మహీరా ఖాన్. పాకిస్థాన్‌కి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. మరి ఏం జరిగింది? మహీరా ఖాన్ ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లిందనేది చూస్తే..
పాకిస్థాన్‌లో పాపులర్ అయిన మహీరా ఖాన్.. 2017లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌తో `రాయిస్` చిత్రంలో నటించింది. రాహుల్ డొలాకియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిరాశ పరిచింది. దీంతోపాటు రణ్ బీర్ కపూర్‌తో కలిసి సిగరేట్ తాగుతున్న ఫోటోలు బయటకొచ్చాయి. అవన్నీ పెద్ద దుమారం రేపాయి.
దీనిపై తాజాగా మహీరా ఖాన్ స్పందించింది. తాను ఫేస్ చేసిన మానసిక సంఘర్షణని బయటపెట్టింది. `రాయిస్` సమయంలో తనపై వచ్చిన విమర్శలు చూసి తాను ఎంతో కలత చెందినట్టు చెప్పింది మహీరా ఖాన్. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌లోకి వెళ్లిందట. టీవీ ఛానెల్స్, ట్వీట్లు, కామెంట్లు ఇలా ఎక్కడ చూసినా తిడుతూనే ఉన్నారని, అది భరించలేక పిచ్చిదాన్నయ్యానని తెలిపింది.
కొన్నిసార్లు భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయట. అందరు కలిసి తనపై దాడి చేసినట్టు అనిపించేదట. దీనికి ట్రీట్‌మెంట్ తీసుకుందామనుకుని డాక్టర్లని కూడా కలిసిందట. చాలా రోజులు నిద్ర లేని రాత్రులు గడిపిందట మహీరా ఖాన్. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడుల ఫలితంగా పాకిస్తాన్ నటులు ఇక మీదట బాలీవుడ్‌లో నటించడానికి వీళ్లేదని షరతు అమల్లోకి వచ్చింది.
ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులపై మహీరాఖాన్ స్పందిస్తూ, అప్పటికే తాను `రాయిస్` సినిమాని పూర్తి చేశానని, అంతా బాగుందనుకునే సమయంలో ఉరి ఉగ్రదాడి జరగడంతో తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయట. చంపేస్తామని ఫోన్ చేశారట. దీంతో `రాయిస్` సినిమా ప్రమోషన్స్ కూడా వెళ్లలేకపోయానని, కానీ ఆ సినిమా పాకిస్తాన్ లో కూడా రిలీజ్ అయితే బాగుండనిపించిందని, ఎందుకంటే షారూఖ్‌ని ప్రేమించే వారు పాకిస్తాన్‌లో కూడా ఉన్నారని తెలిపింది.
`రాయిస్` తర్వాత బాలీవుడ్ సినిమాలకు దూరమయ్యింది మహీరా ఖాన్. పాకిస్తాన్ సినిమాలు, టీవీ షోస్ చేస్తుంది. అక్కడే బిజీ యాక్టర్‌గా రాణిస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతోనూ ఆకట్టుకుంటుంది. పాకిస్తాన్ టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న మహీరా ఖాన్.. అనేక అవార్డులు అందుకుంది. అక్కడ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలుస్తుంది.