Richa Pallod: నువ్వే కావాలి రిచా ఏమైపోయారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
మొదటి చిత్రంతోనే సంచలనాలు చేసిన తారలు చాలా అరుదుగా ఉంటారు. వారిలో రిచా పలాడ్ ఒకరు . ఎంత వేగంగా పేరు తెచ్చుకుందో అంతే వేగంగా ఫేడ్ అవుటైన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు?

Richa Pallod
మిలీనియంలో టాలీవుడ్ ని సునామీలా ముంచెత్తింది నువ్వే కావాలి చిత్రం. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ పరిశ్రమను ఏలుతున్న రోజుల్లో నువ్వే కావాలి విడుదలైంది. భిన్నమైన లవ్ కాన్సెప్ట్ ని ఎంటర్టైనింగ్ తెరకెక్కించి దర్శకుడు కే విజయభాస్కర్ సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ రచయితగా పని చేశారు.
Richa Pallod
స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్ హీరోగా పరిచమయ్యారు. రిచా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు చిత్రాలు చేయడం విశేషం. హీరో హీరోయిన్ గా వారికి డెబ్యూ మూవీ నువ్వేకావాలి. లవ్, కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన నువ్వే కావాలి ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఏడాదికి పైగా థియేటర్స్ లో ఆడిన చిత్రం నువ్వే కావాలి. 2000 అక్టోబర్ 13న విడుదలై అతిపెద్ద విజయం నమోదు చేసింది.
Richa Pallod
ఈ క్రమంలో తరుణ్, రిచా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. రిచాకు తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తాయి. తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ వచ్చింది. తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆమెకు ఎక్కడా బ్రేక్ రాలేదు. స్టార్ డమ్ తెచ్చే హిట్ పడలేదు. 2016లో విడుదలైన తెలుగు చిత్రం మలుపు లో చివరిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు.
Richa Pallod
కెరీర్ డల్ అయ్యాక రిచా వివాహం చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త హిమాన్షు బజాజ్ తో 2011లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోనే నివాసం ఉంటున్నారని సమాచారం.
Richa Pallod
వీరికి ఒక అబ్బాయి. 2013లో పుట్టాడు. అతడికి పదేళ్ల వయసు ఉంటుంది. అబ్బాయి తర్వాత మళ్ళీ పిల్లల్ని కనలేదు.
Richa Pallod
రిచా కొన్ని సీరియల్స్ లో కూడా నటించడం విశేషం. రామ్ లీల, ఖైదీ నంబర్ 1 అనే హిందీ సీరియల్స్ లో రిచా యాక్ట్ చేశారు. అలాగే యువర్ హానర్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. జీ 5లో స్ట్రీమ్ అయిన సదరు సిరీస్లో ఆమె సీరియస్ రోల్ చేశారు.
Richa Pallod
నువ్వే కావాలి మూవీతో తక్కువ సమయంలో ఫేమ్ తెచ్చుకున్న రిచా... అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యింది. మంచి ఆరంభం లభించినా నిలదొక్కుకోలేకపోయింది. హీరోయిన్ గా రిటైర్ అయినా కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కనీసం అక్కా, వదినల పాత్రల్లో అయినా తమను అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.