MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప చూశాను.. కాని ఆ హీరో ఎవరో తెలియదు, అల్లు అర్జున్ పై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

పుష్ప చూశాను.. కాని ఆ హీరో ఎవరో తెలియదు, అల్లు అర్జున్ పై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

అల్లు అర్జున్ ఎవరో తెలియదు అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది..? అది కూడా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ ఆ మాట అంటే..? అది జరగని పని అనుకుంటారు అందరూ. కాని నిజంగా అది జరిగింది. బన్నీ ఎవరో తెలియదంటూ.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఎందుకు కామెంట్ చేసింది...?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 30 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన సినిమా.. ఇప్పటివరకూ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ సినిమా గురించి దేశమంతా మారుమోగింది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా హీరో హోదాను తీసుకువచ్చిందీ మూవీ. ఇలా చెప్పుకుంటూ పోతే.. పుష్ప సినిమా గురించి వస్తూనే ఉంటాయి. 
 

27

ఆరేంజ్ లో దుమ్మురేపిన ఈసినిమా గురించి తెలియనివాళ్లు అంటూ ఉండరు. అల్లు అర్జున్ గురించి తెలియనివాళ్లంటూ కూడా ఉండరు. కాని అల్లు ఫ్యాన్స్ షాక్ అయ్యేలా.. పుష్పటీమ్ నోరెళ్లబెట్టేలా.. అల్లు అర్జున్ అంటే ఎవరు తెలియదంటూ ఓ సీనియర్ హీరోయిన్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవారా హరోయిన్ అంటే..? 
 

37

ఒకప్పుడు వెండితెరపై డాన్సింగ్ ఐకాన్ గా నిలిచిన  హీరోయిన్ విజయలక్మీ. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంటో స్టార్ గా ఎదిగిన విజయలక్ష్మీ... రీసెంట్గా ఆలీతో సరదాగా  గేమ్ షో లో సందడి చేశారు.  సీనియర్ బ్యూటీ ఎల్ విజయలక్ష్మి కి సంబంధించిన ప్రోమో  రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. 

47

ఇక ఈ ప్రోమోలో  ఆలీ రీసెంట్ జనరేషన్ హీరోస్ లో ఏ సినిమా చూశారు అంటూ ప్రశ్నించగా..  పుష్ప అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆ సినిమాలో హీరో ఎవరో మీకు తెలుసా అని ఆలీ అడగగానే ..అతను ఎవరో నాకు తెలియదు కానీ బాగా నటించాడు అన్నారు విజయలక్మీ. దాంతో విజయలక్మీ కామెంట్స్ కు అంతా షాక్ అయ్యారు.  

57

ఇక అప్పుడు ఆలీ మాట్లాడుతూ.. ఆ హీరో ఎవరో కాదు మన కామెడీ కింగ్  అల్లు రామలింగయ్య మనవడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో విజయలక్ష్మీ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  ఏంటో ఇప్పుడు ఏ హీరోని అడిగినా రామానాయుడు మనవడు ,ఎన్టీఆర్ మనవడు ,రామలింగయ్య మనవడు అంటున్నారంటూ  చెప్పుకొచ్చారు విజయలక్ష్మీ. 
 

67

ఈ కామెంట్స్.. దీంతో  ఆమె తెలియక అల్లు అర్జున్ పై  ఆ హీరోయిన్ చేసి ఉంటుందిలే అని కొందరు అనుకుంటుండగా..? మరికొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ మాటలను తీసుకోలేకపోతున్నారు. ఇదేంటి అంటూ.. ఆమెపై మండిపడుతున్నారు. పాన్ ఇండియాకు తెలిసిన హీరో.. మీకు తెలియదా అంటూ కోపగించుకుంటున్నారు. 

77

ఇక ఈ  ప్రోమోలో విజయలక్ష్మి చాలా విషయాలు తెలిపారు. తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొన్న సిచువేషన్స్.. గడిపిన స్వీట్ మెమోరీస్ అన్ని ఓపెన్ గా షేర్ చేసింది. అంతేకాదు తనని ఎన్టీఆర్ కోడలా కోడలా అంటూ ముద్దుగా పిలిచే వారని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని ఆయనతో కలిసి గుండమ్మ కథ సినిమాలో డాన్స్ చేసామని ..కానీ ఆ పాటను కొన్ని అనివార్య కారణాల కారణంగా సినిమా నుంచి తీసేసారని చెప్పకు వచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved