- Home
- Entertainment
- Laila: ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా
Laila: ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా
90వ దశకంలో సినిమాలు బాగా ఫాలో అయినవారికి హీరోయిన్ లైలా గురించి పరిచయం అవసరం లేదు. 2004 వరకు కూడా లైలా తన హవా కొనసాగించింది.

90వ దశకంలో సినిమాలు బాగా ఫాలో అయినవారికి హీరోయిన్ లైలా గురించి పరిచయం అవసరం లేదు. 2004 వరకు కూడా లైలా తన హవా కొనసాగించింది. క్యూట్ లుక్స్.. అల్లరి చేష్టలతో లైలా అందరిని అలరించింది.
ఆమె క్యూట్ లుక్స్ ని అభిమానులు ఎప్పటికి మరచిపోలేరు. వివాహం తర్వాత లైలా సినిమాలకు దూరం అయింది. తెలుగులో లైలా శ్రీకాంత్ సరసన ఎగిరే పావురమా చిత్రంలో నటించింది.
అలాగే బాలకృష్ణ సరసన పవిత్ర ప్రేమ చిత్రంలో కూడా లైలా మెరిసింది. వివాహం తర్వాత లైలా పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఆమెకు ఇద్దరు కొడుకులు సంతానం.
ఇదిలా ఉండగా లైలా ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ ని ప్రారంభించింది. తమిళంలో సర్దార్ చిత్రంతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతోంది లైలా. అలాగే తెలుగు ప్రేక్షకులని సైతం పలకరిస్తుంది. పాపులర్ కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రస్తుతం లైలా జడ్జిగా వ్యవహరిస్తోంది.
దీనితో లైలాని చూసిన వారు ఆమె పాత చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇక లైలా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా మారింది. ప్రస్తుతం లైలా వయసు 41 ఏళ్ళు. సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత అదే స్ట్రక్చర్ మైంటైన్ చేయడం అంత సులువు కాదు.
కానీ లైలా తన లేటెస్ట్ ఫొటోస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికి ఆమె ముఖంలో అదే వెలుగు కనిపిస్తోంది. అందం కూడా ఏమాత్రం తగ్గలేదు. ట్రెండీ డ్రెస్సుల్లో లైలా హాట్ టచ్ హాట్ గా ఇస్తున్న ఫోజులు వైరల్ అయ్యాయి.
గతంలో లైలా బాలకృష్ణని కలిసినప్పుడు 'పవిత్ర ప్రేమ' టైంలో మెమొరీస్ గుర్తు చేసుకుంది. లైలా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .