సీనియర్ హీరోయిన్ మీనా మళ్లీ తల్లి కాబోతోందా..? వైరల్ అవుతున్న ఫోటోస్,వీడియోస్
సీనియర్ హీరోయిన్ మీనా మళ్ళీ తల్లి కాబోతోందా..? సోషల్ మీడియాలో వైరలు అవుతున్న ఈ న్యూస్ నిజమేనా..? మరి తన సోషల్ మీడియాలో శేర్ చేసిన వీడియోలో ఏముంది..? ఆర్టిస్ట్ గా మళ్లీ బిజీ అవుతున్న మీనా ప్రెగ్నెన్సీ విషయంలో నిజానిజాలేంటి..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగువెలిన తార మీన చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మీన.. హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. ఆమె తోటి హీరోయిన్స్ అంతా.. క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. బిజీ అయిపోయారు కాని..మీన మాత్రం ఇంకా హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తోంది. రీసెంట్ గా దృశ్యం2తో అలరించింది బ్యూటీ.
తన అందచందాలతో, అభినయంతో హీరోయిన్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్న మీనా.. ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం హద్దుల్లో ఉంటూ వచ్చింది. కెరీర్ లో అవకాశాలు తగ్గిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా.. వెంటనే పెళ్లి చేసేసుకుంది మీనా. వ్యాపారవేత్త సాగర్ ను ప్రేమించి ఆయనతో ఏడడుగులు వేసింది.
వారిద్ధరికి ఒక పాప జన్మించగా.. ఆమెకు నైనిక అని పేరు పెట్టారు. ఈ సాస రైడా ఈ మధ్య సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు సినిమాలో విజయ్ కూతురుగా నటించి మెప్పించింది మీనా గారాల పట్టి.
ఇక రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మీన.. అటు టీవీ షోస్ తో మూవీస్ తో బిజీగా గడుపుతోంది. ఇక ఇప్పుడు మీనా రెండో సారి తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో రూమర్ గట్టిగా నడుస్తోంది. ఈ రూమర్ తో పాటు ఓ వీడియో తో పాటు కొన్ని ఫోటోస్ కూడా హల్ చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీనా..తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా ప్రెగ్నంట్ గా కనిపించింది.
అంతే కాదు ఆమె రూపం కూడా చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది అంటూ... వీ క్యాప్షన్‌గా రాసింది మీనా.
ఇక ఈ పోస్ట్‌ను బట్టి మీనా ఓ సనిమాలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ కోసమే మీనా ప్రాక్టీస్ చేస్తూ..ఈ వీడియోను షేర్ చేసినట్లు సమాచారం. ఇక ఇలాంటి వీడియోలు దొరికితే నెటిజన్లు ఊరుకోరు కదా.. చాలామంది సోషల్ మీడియా జనాలు ఈ పోస్ట్ కు కంగ్రాట్స్ అని, మరికొందరు మాత్రం కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ అని కామెంట్స్ పెడుతున్నారు.