ఈవివి వల్లే ఇలా బ్రతికి ఉన్నా.. సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కామెంట్స్ వైరల్
తాను ప్రస్తుతం ఇలా బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం దివంగత దర్శకుడు ఈవివి సత్యనారాయణే అని అన్నారు.. సీనియర్ కమెడియన్ బాబు మోహన్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్స్ ఎవరు అంటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో... బ్రహ్మానందం తరువాత వినిపించే పేరు బాబు మోహన్. తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ప్రత్యేక స్ధానం. చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ వస్తున్న బాబూ మోహన్.. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. తరాలు గుర్తు పెట్టుకునే విధంగా హాస్యాన్ని ఆడియన్స్ కు అందించారు.
అప్పటికీ.. ఇప్పటికీ.. సినిమాల్లో ఆయన కనిపిస్తే చాలు.. బాబు మోహన్ కామెడీ సీన్స్ చూస్తే చాలు కడుపుబ్బా నవ్వేస్తాం. నటుడిగానే కాకుండా పొలిటీషియన్‌గా కూడా రాణించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒక కమెడియన్ గా తాను ఎన్ని నవ్వులు పంచినా.. తన జీవితంలో అంతకంటే ఎక్కువ విషాదాలు కూడా ఉన్నాయంటున్నారు బాబు మోహాన్.
బాబుమోహన్ అనగానే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుగారితో నటించిన కామెడీ సీన్స్ కళ్లముందు కనిపిస్తాయి. సినిమాలంటే ఉన్న క్రేజ్‌తో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగారు బాబు మోహాన్. పట్టుదలతో కమెడియన్ గా టాలీవుడ్ ల్ స్థిరపడ్డాడు బాబు.
మామగారు సినిమాలో.. కోటా కాంబినేషన్ లో సీన్లు.. మరీ ముఖ్యంగా బాబుమోహాన్ వేసిన బిచ్చగాడు పాత్ర ఆయన కెరియన్‌ని ఓ మలుపు తిప్పింది. ఆతరువాత వరుసగా రాజేంద్రుడు-గజేంద్రుడు, జంబలకిడి పంబ, పెదరాయుడు లాంటి సినిమాలు కమెడియన్‌గా బాబు మోహన్ స్తాయిన పెంచాయి. టాలీవుడ్ లో ఆయనకు స్టార్ డమ్ ను అందించాయి సినిమాలు .
అంతే కాదు ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా రాణించారు బాబు మోహాన్. 1999 టీడీపీ తరపున పోటీ చేసి ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగు దేశం ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా కూడా పనిచేశారు బాబుమోహాన్.. ఇక జీవితంలో ఆయన కోలుకోలేని దెబ్బ తీసింది మాత్రం కొడుకు మరణం. 2009 లో కొడుకు మరణం ఆయనను కుంగదీసింది. అది ఎంతలా అంటే.. చాలా కాలం ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.
ఇక రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సినిమాలు జోరుగా నడుస్తున్న టైమ్ లో తను డబ్బుపై దృష్టి పెట్టలేదన్నారు బాబుమోహన్. అంతే కాదు.. ఎవరినీ డిమాండ్ చేయలేదని.. కొంత మంది నిర్మాతలు డబ్బు ఎగ్గొట్టేవారని.. అయినా తాను పట్టించుకోలేదు అన్నారు. సినిమాకి ఇంత డబ్బు ఇవ్వండి అని నిర్మాతల్ని ఏరోజు డిమాండ్ చేయలేదట.
అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్లిపోయేవారట. మళ్లీ డబ్బింగ్ టైంలో బాబు మోహన్ డబ్బులు అడిగేవారట. కొందరు చెక్ రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పేవారట. మళ్లీ కనిపించేవారు కాదట. చాలామంది ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయట. ఇటీవల ఇల్లు మారినప్పుడు కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చెక్కులు బయట పారేసినట్లు బాబు మోహన్ చెప్పారు.
హీరోగా అవకాశాలు వచ్చినా నటుడిగా చాలా సినిమాలకు ఆఫర్లు రావడంతో హీరో అవకాశాలు వదులుకున్నానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. కొడుకు ప్రమాదంలో చనిపోయినపుడు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని..ఎంతో ముద్దుగా పెంచుకున్న తనయుడి మరణం తట్టుకోలేక చనిపోదాం అనుకున్నానన్నారు బాబుమోహాన్. అయితే అదే సమయంలో.. తనని దర్శకుడు ఈవివి కనిపెట్టుకుని ఉన్నారన్నారు.
Babu Mohan
డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ మామూలు మనిషిని చేసారని అన్నారు. ఎవడి గోల వాడిదే సినిమా కోసం బ్యాంకాక్ తీసుకెళ్లి తన వెంటే ఉండి తనను మామూలు మనిషిని చేసిన దేవుడు అంటూ ఈవీవీని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బాబూ మోహన్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు బాబు మోహాన్.. కొన్ని కారణాల వల్ల బీఆర్ ఎస్ ను వీడి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు