దీన స్థితిలో రమాప్రభ...? వైరల్ అవుతున్న న్యూస్.. ఘాటుగా స్పందించిన సీనియర్ నటి
తెలుగు తెరపై వెలుగు వెలిగిన అలనాటి నటీనటులలో రమాప్రభ కూడా ఒకరు. వయస్సురిత్య నటనకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ.. తమ్ముడి ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్య రమా ప్రభ పరిస్థితి ఏమీబాగోలేదంటూ.. వార్తలు గుప్పుమన్నాయి.
దాదాపు 15 వందలకుపైగా సినిమాల్లో నటించింది రమాప్రభ. కోట్లలో ఆస్తులుసంపాదించింది. కాలక్రమంలో ఆ ఆస్తులను పొగొట్టుకుంది కూడా. ఆతరువాత కొన్నిసినిమాల్లో నటిస్తూ..కాస్త కూడబెట్టుకుంది. ఇండస్ట్రీకి.. హైదరాబాద కుదూరంగా బ్రతుకుతుంది.
ఈక్రమంలో ఆమె పరిస్థితిపై కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో.. యూటూబ్యూ ఛానల్స్ లో రకరకాల వార్తలు వండి వార్చారు. రమాప్రభ పరిస్థితి ధారుణంగా ఉందని.. ఆమె అడుక్కుని తినే పరిస్థితుల్లో ఉందంటూ.. ప్రచారం చేశారు. ఇండస్ట్రీ వారితో పాటు రమా ప్రభ అభిమానులు కూడా ఈ వార్తలతో కలవరపడ్డారు.
అయితే ఈ వార్తలపై రీసెంట్ గా స్పందించింది రమా ప్రభా. తాను అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజం లేదు అంటుంది రమా ప్రభ. వయో భారంతో సినిమాలు మానేశాను కాని.. దీన పరిస్థితుల్లో మాత్రం లేను అంటూ తన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ప్రస్తావించింది.
నేను ఎలా ఉన్నారు.. నా కుటుంబ.. నా ఇల్లు గురించి నా యూట్యూబ్ ఛానెల్ లో క్లియర్ గా చెప్పాను.. చూపించాను కూడా.. అదంతా చూసి కూడా.. నా పరిస్థితి గురించి ఇలా ఎలా రాస్తారంటూ మండిపడింది రమాప్రభ. ఇది నా ఇల్లు అయినప్పుడు నేను ఎలా అడుక్కుతింటాను.. నేను బిజీగా ఉన్నప్పుడు నా పరిస్థతి ధారుణంగా ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది.
అంతే కాదు నా కంటూ ఇండస్ట్రీలోఆత్మీయులు ఉన్నారు. పూరీ, నాగార్జున లాంటి వారు తమ సొంతవారిగా భావించి ఇప్పటికీ తనకు నెల నెల సాయం చేస్తున్నారంటోంది రమాప్రభ. ఇవన్నీ చూసి కూడా నేను అడుక్కుతినే పరిస్థితుల్లో ఉన్నట్టేనా.. అంటూ రమా ప్రభ ప్రశ్నించింది.
మదనపల్లి ప్రాతంలో రమాప్రభ సోంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. తన తమ్ముడు ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఆశ్రమంలాగా మలచుకున్న ప్రాంగణంలో చిన్న గుడితో పాటు.. ఇష్టమైన తోటను కూడా ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడిపేస్తున్నారు రమా ప్రభ. అంతే కాదు తనకు కావల్సిన కాస్ట్యూమ్స్ ను తానే స్ట్రిచ్చింగ్ చేసుకుంటూ.. ఇష్టమైనవి వండుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.