లీక్ అవుతాయనుకోలేదు.. టాప్ లెస్ ఫోటో షూట్‌పై స్పందించిన హోమ్లీ హీరోయిన్
కొన్నేళ్ల కిందట కస్తూరి చేసిన ఓ ఫోటో షూట్ సెన్సేషన్ అయ్యింది. టాప్ లెస్‌గా బ్రెస్ రివీల్ చేస్తూ ఓ బిడ్డకు పాలు ఇస్తూ ఫోటో షూట్‌లో పాల్గొంది కస్తూరి. తల్లిపాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఫోటో షూట్ చేసింది కస్తూరి. అయితే అప్పటి వరకు హోమ్లీ రోల్స్ మాత్రమే చేసిన కస్తూరి ఒక్కసారిగా టాప్‌లెస్‌గా కనిపించటంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
నిన్నటితరం తెలుగు సినిమాలతో పరిచయం ఉన్నవారికి కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా భారతీయుడులో కమల్ హాసన్ కూతురిగా, భక్తిరస చిత్రం అన్నమయ్యలో నాగార్జునకు జోడిగా నటించి మెప్పించింది కస్తూరి. హీరోయిన్‌గానే కాదు క్యారెక్టర్ రోల్స్‌లోనూ తెలుగు, తమిళంలో చాలా చిత్రాలు చేసింది కస్తూరి.
పెళ్లి తరువాత లైఫ్‌లో సెటిల్ అయిన బ్యూటీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మీ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది కస్తూరి. ఈ నేపథ్యంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గోన్న కస్తూరి గతంలో తనను ఇబ్బంది పెట్టిన ఓ ఫోటో షూట్ గురించి స్పందించింది.
కొన్నేళ్ల కిందట కస్తూరి చేసిన ఓ ఫోటో షూట్ సెన్సేషన్ అయ్యింది. టాప్ లెస్‌గా బ్రెస్ రివీల్ చేస్తూ ఓ బిడ్డకు పాలు ఇస్తూ ఫోటో షూట్‌లో పాల్గొంది కస్తూరి. తల్లిపాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఫోటో షూట్ చేసింది కస్తూరి. అయితే అప్పటి వరకు హోమ్లీ రోల్స్ మాత్రమే చేసిన కస్తూరి ఒక్కసారిగా టాప్‌లెస్‌గా కనిపించటంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ ఫోటోలు ఇంటర్‌నెట్‌ను షేక్ చేశాయి.
ఈ ఫోటో షూట్‌ఫై స్పందించిన కస్తూరి ఆ ఫోటోల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఆ ఫోటోలు తాను ఓ ఫారిన్ మ్యాగజైన్ కోసం చేసిన షూట్‌కి సంబంధించినవని క్లారిటీ ఇచ్చింది. మన కల్చర్ లో ఇలాంటివి స్వాగతించరని తెలుసన్న కస్తూరి, ఆ ఫోటోలను ఎవరో లీక్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ ఫోటోలు ఆన్‌లైన్ దర్శనమివ్వటం తనను కూడా ఎంతో ఇబ్బంది పెట్టిందని చెప్పింది కస్తూరి. ఆ ఫోటోలు వైరల్ అయిన సమయంలో తన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో తాను చేసింది తప్పేమో అన్న ఆలోచన కూడా వచ్చిందని చెప్పింది కస్తూరి.