దిమ్మ తిరిగే షాక్.. బిగ్ బాస్ నుంచి సరయు ఎలిమినేటెడ్ ?
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తొలివారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి 5 రెట్ల వినోదం గ్యారెంటీ అని నాగార్జున ప్రేక్షకులకు హామీ ఇచ్చారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తొలివారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి 5 రెట్ల వినోదం గ్యారెంటీ అని నాగార్జున ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. కానీ షోలో పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో జోష్ తగ్గినట్లు అనిపిస్తోంది.
ఆడియన్స్ నిరాశని పోగొట్టేందుకు బిగ్ బాస్ టీం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మసాలా డోస్ పెంచడం, ఊహించని ట్విస్ట్ లు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని భావిస్తున్నారు. గత నాలుగు సీజన్స్ లో లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తొలిరోజే హౌస్ లోకి పంపారు.
ఇక తొలి వారం ఫస్ట్ ఎలిమినేషన్ కు టైం దగ్గర పడింది. నేడు (ఆదివారం ఎపిసోడ్) నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ప్రకటించనున్నారు. దీనితో ఉత్కంఠ పెరుగుతోంది. బిగ్ బాస్ నుంచి ఎప్పుడూ లీకులు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు కూడా లీక్ అయ్యింది.
ఈవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే బోల్డ్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సరయు అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా ప్రేక్షకులు కూడా ఊహించని పరిణామం. ప్రస్తుతం బిగ్ బాస్ 5లో ఆర్జే కాజల్, సరయు, జశ్వంత్, మానస్, హమీద, రవి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో సరయు ని ఎలిమినేట్ చేయడానికి నాగ్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.
సరయుపై ప్రేక్షకులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. ఆమె యూట్యూబ్ లో బోల్డ్ డైలాగులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తరహా వ్యవహారం బిగ్ బాస్ హౌస్ లో కూడా చేస్తుందని, మిగిలిన కంటెస్టెంట్స్ ఆమె ముందు నిలవడం కష్టం అని అంతా భావించారు. కానీ తొలి వారం ఆమెకు హౌస్ లో స్క్రీన్ స్పేస్ దక్కలేదు.
కెప్టెన్సీ టాస్క్ లో ఆర్జే కాజల్ తో కాసేపు వాగ్వాదం నడిచింది అంతే. అయినప్పటికీ ఆమె అందుకు ఎలిమినేట్ అవుతోందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఏది ఏమైనా నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ షాక్ గ్యారెంటీ అనే వార్తలు వస్తున్నాయి.