- Home
- Entertainment
- అప్పుడు సమంత-విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రష్మిక-తరుణ్ భాస్కర్.. `మహానటి`కి-`సీతారామం`కి లింకేంటి?
అప్పుడు సమంత-విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రష్మిక-తరుణ్ భాస్కర్.. `మహానటి`కి-`సీతారామం`కి లింకేంటి?
సమంత, విజయ్ దేవరకొండల కెమిస్ట్రీ `మహానటి` చిత్రంతో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇప్పుడు `సీతారామం` చిత్రంలోనూ రష్మిక, తరుణ్ భాస్కర్‌ల మధ్య కెమిస్ట్రీ ఆద్యంతం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం కాలంలోని వ్యక్తులు, గతాన్ని చెప్పడమనేది, గతం తాలుకూ రహస్యాలను బయటకు తీయడమనేది, గొప్ప వ్యక్తుల కథని రివీల్ చేయడమనే కాన్సెప్ట్ సినిమాల్లో బాగా పాపులర్‌గా నిలుస్తుంది. హిట్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ స్క్రీన్ ప్లే సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంటుంది. `మహానటి`(Mahanati) విషయంలో అదే జరిగింది. `జార్జిరెడ్డి`లోనూ ఈ విధంగానే చూపించారు. ఇలా చాలా సినిమాలొచ్చాయి. కానీ ఇప్పుడిది చూడబోతుంటే నయా ట్రెండ్‌గా మారబోతుండటం విశేషం.
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన `మహానటి` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఏకంగా ఉత్తమ నటిగా కీర్తిసురేష్(Keerthy Suresh)కి జాతీయ అవార్డు దక్కింది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సావిత్రి కథని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లైనా సమంత(Samantha), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)లు చెబుతుంటారు. సావిత్రికి సంబంధించిన డిటెయిల్స్ అన్వేషించే క్రమంలో అసలు విషయాలు బయటకు వస్తుంటాయి.
ఇందులో సమంత, విజయ్ కలిసి అనేక రహస్యాలను బయటకు తీస్తారు. అసలు శంకరయ్య ఎవరనేది వెలికితీస్తుంటారు. సావిత్రి జీవితంలోని విషాదకర అంశాలను బయటపెట్టి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. చివరల్లో శంకరయ్య ఫోటోని సావిత్రి చేతిలో పెట్టడం, ఆ టైమ్‌లో వచ్చే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇలాంటి స్క్రీన్‌ప్లే ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్ బ్రిలియన్సీకి అద్దం పట్టింది. మరోవైపు ఇందులో సమంత, విజయ్ దేవరకొండల మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే కామెడీ, వారి కెమిస్ట్రీ మరో హైలైట్‌గా నిలిచింది.
తాజాగా అదే కాన్సెప్ట్ `సీతారామం`(Sita Ramam)లో కనిపిస్తుండటం విశేషం. `మహానటి`లో జెమినీ గణేషన్‌గా నటించిన దుల్కర్ సల్మానే ఇందులో హీరోగా, సినిమాలో రామ్‌గా నటిస్తున్నారు. సీతగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. రష్మిక(Rashmika Mandanna) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెకి సహాయం చేసే పాత్రలో తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) కనిపిస్తున్నారు.
హనురాఘవపూడి రూపొందించిన `సీతారామం` చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇటీవల సోమవారం విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సీత ఎవరనేది తెలుసుకునేందుకు రష్మిక, తరుణ్ భాస్కర్ వెతకడం, ఈ క్రమంలో అనేక మంది ఆర్మీ ఆఫీసర్లని, ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం ట్రైలర్‌లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఓ రకంగా `మహానటి`లో సమంత, విజయ్ దేవరకొండ మాదిరిగానే, `సీతారామం` చిత్రంలోనూ రష్మిక మందన్నా, తరుణ్ భాస్కర్ పాత్రలుండటం విశేషం. అయితే `మహానటి` చిత్రాన్ని నిర్మించిన వైజయంతి బ్యానర్‌లోనే `సీతారామం` సినిమా తెరకెక్కడం విశేషం. అయితే దీనిపై దర్శకుడు మాట్లాడుతూ, తాను కోటిలో కొన్న ఓ పాతపుస్తకంలో లెటర్ దొరికిందని, ఆ లెటర్ స్ఫూర్తితో `సీతారామం` కథని ఫీక్షనల్‌గా రాసుకున్నట్టు చెప్పారు హను రాఘవపూడి. ఇందులో అసలు కథని రష్మిక మందన్నానే మలుపు తిప్పుతుందని కూడా చెప్పడం విశేషం.