MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత చుట్టూ బిగుస్తున్న `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వివాదం.. కేంద్రం ఏం చేయబోతుంది?

సమంత చుట్టూ బిగుస్తున్న `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వివాదం.. కేంద్రం ఏం చేయబోతుంది?

సంచలన వెబ్‌ సిరీస్‌ `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత చుట్టూనే ఈ వివాదం తిరుగుతుంది. ఓ రకంగా ఆమె పాత్రకే ఇప్పుడు ఎసరు పెట్టబోతుంది. 

2 Min read
Aithagoni Raju
Published : May 30 2021, 09:11 AM IST| Updated : May 30 2021, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆ వివరాలు చూస్తే ప్రియమణి నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్‌ సిరీస్‌ బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా దీనికి సీక్వెల్‌గా `ది ఫ్యామిలీ మ్యాన్‌2`ని రూపొందించారు. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించగా, ఇందులో సమంత, మనోజ్‌ భాజ్‌పాయ్‌, ప్రియమణి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.

27
ఇటీవల ట్రైలర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. ఇందులో సమంత పాత్ర వివాదంగా మారింది. ఆమె ఇందులో టెర్రరిస్ట్ గా కనిపిస్తున్నారు. నేను అందర్నీ చంపేస్తా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు మరింతగా వివాదానికి, దుమారానికి కారణమవుతుంది. పాకిస్తాన్‌ తీవ్రవాదుల ఆట కట్టించడానికి భారతీయ ‘రా’ అధికారి చేసే ప్రయత్నమే తొలి సీజన్‌ కథాంశం కావడంతో వివాదాలేవీ రాలేదు.

37
కానీ రెండో భాగంలో సమంత పాత్రని ఎల్‌టీటీఈ కి చెందిన వ్యక్తిగా చూపించడమే ఇందుకు కారణమైంది. చెన్నై నేపథ్యంలో రెండో సీజన్‌ కథ సాగుతున్నట్టు అందులో స్పష్టమవుతూ ఉంది. రాజీ(సమంత పాత్ర పేరు)ను అడ్డుకునే అధికారిగా శ్రీకాంత్‌ తివారి పాత్రను చూపించారు. అయితే, శ్రీలంకలో తమిళ ప్రజల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈ (లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం) సంస్థకు, పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్టు చూపించారని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

47
ఇది ముమ్మాటికీ తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరచడం, చరిత్రను వక్రీకరించమే అంటూ సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. `ద ఫ్యామిలీ మ్యాన్‌ 2 ఎగైనెస్ట్‌ తమిళ్స్‌`, `షేమ్‌ ఆన్‌ సమంత` హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యాయి. సిరీస్‌ను బ్యాన్‌ చేయాలని చాలామంది తమిళులు ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. తమిళులను కించపరిచే విధంగా ఉన్న పాత్రలో సమంత నటించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ అన్‌సబ్‌స్రైబ్‌ చేస్తున్నట్టు ట్వీట్లు చేశారు.

57
ఓటీటీ మాధ్యమాన్నీ బ్యాన్‌ చేయాలనే డిమాండ్స్‌ వినిపించాయి. చివరకు, తమిళ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్రమంత్రికి లేఖ రాసింది. అంతకు ముందే రాజ్యసభ సభ్యులు వైకో సైతం ఈ వెబ్‌ సిరీస్‌ బ్యాన్‌ చేయాలని ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు. తమిళ ప్రభుత్వం, తమిళ ప్రజలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో ముఖ్యమైనవి. ఒకటి... ఉద్దేశ పూర్వకంగా తీవ్రవాద పాత్రకు తమిళ నటిని తీసుకోవడం నేరుగా తమిళుల గౌరవంపై దాడి చేయడమే. ప్రపంచంలోని తమిళులు ఎవరూ దీన్ని సహించరు. రెండు... ముందుగా చెప్పుకొన్నట్టు శ్రీలంకలో తమిళ ఈలం సభ్యుల పోరాటాన్ని కించపరచడమే.

samantha

67
వివాదానికి కేంద్ర బిందువైన అంశంపై దర్శకులు రాజ్‌-డీకే స్పందించారు. `తమిళ ప్రజలపైన మాకు అపూర్వమైన ప్రేమ, అంతకు మించిన గౌరవం ఉన్నాయి. తమిళ సంస్కృతి, ప్రజల మనోభావాల పట్ల మాకు అవగాహన ఉంది. రచన, నట బృందంలో అధిక శాతం తమిళులు ఉన్నారు. ట్రైలర్‌లో కొన్ని షాట్లు చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. షో విడుదలయ్యే వరకూ ఎదురు చూడండి` అని రాజ్‌-డీకే పేర్కొన్నారు. మనోజ్‌ బాయ్‌పాయ్‌ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

77
జూన్‌ 4న `ద ఫ్యామిలీ మ్యాన్‌ 2` అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. గతంలో రాజీవ్‌ గాంధీ హత్యోదంతంపై తెరకెక్కిన జాన్‌ అబ్రహం హిందీ సినిమా `మద్రాస్‌ కేఫ్‌`, రాజీవ్‌ మీనన్‌ `ఇనాం` చిత్రాలు తమిళనాడులో నిషేధం ఎదుర్కొన్నాయి. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఆ రెండిటినీ నిషేధించినట్టుగా, ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ను నిషేధించాలని రాజ్యసభ ఎంపి వైకో, తమిళ నటుడు, ఫిల్మ్‌మేకర్‌, రాజకీయ నాయకుడు సీమాన్‌ కోరుతున్నారు. మరి ఈ వెబ్‌ సిరీస్‌ వివాదం ఎలాంటి మలుపుతు తిరుగుతుంది? చివరికి విడుదలవుతుందా? బ్యాన్‌ని ఎదుర్కొంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved