Samantha: జీవితంలో ఇక అవి వద్దు.. ఫ్యాన్స్ కి సమంత షాకింగ్ ఆన్సర్
సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది.

Samantha
సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది.
samantha
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమంత ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. థియేటర్ లో చూసిన తొలి చిత్రం ఏదని ప్రశ్నించగా.. జురాసిక్ పార్క్ అని బదులిచ్చింది. ఇక తన తొలి సంపాదన రూ. 500 అట. హోటల్ హోస్టెస్ గా పనిచేసినందుకు ఆ మొత్తం ఇచ్చారట.
మరో అభిమాని సమంతని టాటూల గురించి ప్రశ్నించాడు. మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకునే టాటూలు ఏంటని అడిగాడు. దీనికి సమంత కాస్త సమయం ఆలోచించుకుని బదులిచ్చింది. ఇక తానూ టాటాలే వేయించుకోకూడదు అనుకుంటున్నట్లు బదులిచ్చింది. తనకు ఆలోచన లేదని సామ్ తెలిపింది. అయితే సమంత ఆల్రెడీ మూడు టాటూలు వేయించుకుని ఉంది.
samantha
ఆ టాటూలలో నాగ చైతన్యకి సంబంధించిన టాటూలు కూడా ఉన్నాయి. చైతు, తాను కలసి నటించిన తొలి చిత్రం 'ఏమాయ చేశావే'కి గుర్తుగా వీపుపై వైఎంసీ అని టాటూ వేయించుకుని ఉంది. అలాగే నడుము భాగంలో 'నాగ చైతన్య పేరుని టాటూ వేయించుకుంది. అలాగే చేతిపై కూడా సమంతకి ఓ టాటూ ఉంది.
చై సామ్ విడిపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలు అలాగే మిగిలిపోయాయి. దీనితో సమంత టాటూలపై అభిమానులతో ఇలా స్పందించింది. ఎంతో ఘాడంగా ప్రేమించుకుని అన్యోన్యంగా వైవాహిక జీవితంలో కొనసాగిన వీరిద్దరూ గత ఏడాది అక్టోబర్ లో అందరికి షాక్ ఇస్తూ విడాకులు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా చైతో విడిపోయిన తర్వాత సమంత నుంచి రాబోతున్న తొలి చిత్రం కణ్మణి రాంబో ఖతీజా. ఈ చిత్రంలో సమంత.. విజయ్ సేతుపతికి జంటగా నటించింది. నయనతార కూడా ఈ చిత్రంలో మరో హీరోయిన్. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఫన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించారు.