MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సమంతనా మజాకా.. నెట్టింట దుమ్ములేపుతున్న ఫోటో.. `దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ స్టార్‌`

సమంతనా మజాకా.. నెట్టింట దుమ్ములేపుతున్న ఫోటో.. `దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ స్టార్‌`

తారలు సోషల్‌ మీడియాని బాగా వాడుకుంటారు. తమని తాము ప్రమోట్‌ చేసుకునేందుకు ఇది పర్‌ఫెక్ట్ ఫ్లాట్‌ఫామ్‌. కానీ సమంత ఇంటర్నెట్‌ని వాడుకోవడంలో పీక్‌లోకి వెళ్లింది. అందుకు ఆమె తాజాగా పంచుకున్న ఓ పోస్టే కారణంగా చెప్పొచ్చు. జస్ట్ ఒక ఫోటో, ఒక ట్యాగ్‌. అంతే ఫోటో ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 14 2021, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత నోడ్‌ డౌట్‌ సౌత్‌లో మేటి స్టార్‌హీరోయిన్‌. నయనతార రేంజ్‌ ఆమెది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో తాను ఓ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంటోంది. మ్యారేజ్‌ తర్వాత మరింతగా జోరుమీదున్నది అక్కినేని కోడలు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నటన పరంగానే కాదు వ్యాపారంలోనూ దూసుకుపోతుంది సమంత. ఆమె అనేక బ్రాండ్లకి ప్రచార కర్తగా వ్యవహరిస్తుంది. ఇటు సినిమాలు, అటు ప్రకటనలతో బాగానే సంపాదిస్తుంది. మరోవైపు వ్యాపారాల్లోనూ దూసుకుపోతుంది సమంత. ఆమె `సాకి` పేరుతో ఓ ఫీమేల్‌ వేర్‌ని రన్‌ చేస్తుంది. గతేడాది కరోనా సమయంలోనే దీన్ని ప్రారంభించింది సమంత. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.

38

కట్‌ చేస్తే.. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పంచుకుంది. కారులో కూర్చొని దిగిన ఫోటో. ఈ సందర్భంగా ఫ్లవర్‌ ప్రింటెడ్‌ ట్రెండీ వేర్‌ని ధరించింది. ఇందులో `మై సాకీ వరల్డ్` అనే ట్యాగ్‌ని పంచుకుంది. తన సొంత బ్రాండ్‌కి చెందిన డ్రెస్‌లో సింపుల్‌గా పోజులిచ్చింది సమంత.
 

48

అంతే ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల వ్యూస్‌ వచ్చేశాయి. 18గంటల్లో 15లక్షల మంది చూశారు. దీంతో ఈ ఫోటోలో ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎక్కడ చూసిన సమంత ఫోటోనే కనిపిస్తుండటం విశేషం. దీంతో ఈ ఫోటో ఏ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిపోయింది అర్థం చేసుకోవచ్చు. 
 

58

ఓ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌కి, పాపులారిటీకి నిదర్శనంగా నిలిచిందీ ఫోటో. తన ఇమేజ్‌ని సమంత ఇలా వాడుకుంటోంది. తన సొంత బ్రాండ్‌ని సింపుల్‌గా ప్రమోట్‌ చేసుకుంటోంది. రూపాయి ఖర్చు లేకుండా కోట్ల విలువలైన ప్రచారాన్ని పొందుతుంది. `దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ స్టార్‌` అనే డైలాగ్‌కి సార్థకం చేసింది సామ్‌. సోషల్‌ మీడియాని వాడుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది సమంత. 

68

ప్రస్తుతం సమంత.. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలోని ఆమె నటిస్తున్న శకుంతల పాత్ర షూటింగ్‌ పార్ట్ పూర్తి చేసుకుంది. రెండు రోజుల క్రితమే సెట్‌కి గుడ్‌బై చెప్పింది. యూనిట్‌ సైతం ఆమెకి గ్రాండ్‌గా ఫేర్‌వెల్‌ పలికారు. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` అనే సినిమాలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది.

78

సమంత తన `శాకుంతలం` చిత్రం గురించి చెబుతూ, `గుణశేఖర్‌గారు కథ చెప్పినప్పుడు `శాకుంతలం` ప్రపంచాన్ని ఊహించుకున్నా. కానీ అంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా? అనిపించింది. అయితే నా అంచనాలను మించిన ప్రపంచాన్ని సృష్టించారాయన. అద్భుతమైన కథలను ఇష్టపడే నాలోని చంటిపిల్ల కలను నిజం చేసిన గాడ్‌ఫాదర్‌ గుణశేఖర్‌గారు. ఇప్పుడు నాలోని ఆ చంటిపిల్ల సంతోషంతో గంతులేస్తోంది. ఈ యూనిట్‌కి బైబై చెబుతుంటే బాధగా ఉంది` అని పేర్కొన్నారు.

88

మరోవైపు సమంత ఫిట్‌నెస్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కచ్చితంగా ప్రతి రోజు జిమ్‌లో గడుపుతుంటుంది. తన బాడీలోకి ఏమాత్రం ఫ్యాట్‌ చేరనివ్వకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటుంది సమంత. అందుకే పెళ్లి తర్వాత కూడా ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేయగలుగుతుంది. యంగ్‌ హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved