మనం విడిపోవడానికి కారణం అదే.. షాకింగ్ పోస్ట్ తో నాగ చైతన్యకి సమంత కౌంటర్ ?
సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు.

సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు. అయితే సమంత మాత్రం తరచుగా సోషల్ మీడియాలో పరోక్షంగా చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా చైతు మే 12న తన కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా చైతు ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడిప్పుడే చైతు సమంత గురించి మాట్లాడుతున్నాడు. సమంత చాలా మంచి వ్యక్తి అని ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నట్లు చైతు తెలిపాడు.
విడిపోయినప్పటికీ మా ఇద్దరి మధ్య గౌరవ సంబంధాలు ఉన్నాయని చైతు తెలిపాడు. అయితే మా ఇద్దరి మధ్య పగ ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చైతు తెలిపాడు. తనకి సంబంధం లేని వ్యక్తులని సృష్టించి సమంత నిందిస్తున్నారని కూడా చైతు తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే నాగ చైతన్య వ్యాఖ్యలకు కౌంటర్ గా స్పందించిందో లేక నార్మల్ గానే పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారో వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు. బహుశా ఇంకెవరికైనా తెలిసి ఉంటే ఆది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అయి ఉండాలి.
అయితే సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 'మనమంతా ఒక్కటే.. కేవలం ఇగోలు, నమ్మకాలు, భయాల వల్లే విడిపోయాం'అని ఉన్న కొటేషన్ ని సమంత షేర్ చేసింది.
అంటే చైతు, సమంత ఇగో ఫీలింగ్ వల్లే విడిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. చైతుతో విడిపోవడం వల్ల సమంత అనేక నిందలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సమంత చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసేలా ఉన్నాయి.