Samantha Ruth Prabhu : సమంతకు యాక్టింగ్ లో రోల్ మోడల్ ఎవరో తెలుసా? టాలీవుడ్ హీరో పేరు చెప్పిన సామ్!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె యాక్టింగ్ రోల్ మోడల్ మాత్రం అతనేనని టాలీవుడ్ హీరో పేరును చెప్పింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ వరుస చిత్రాలతో అలరిస్తోంది.
సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సమంత. అంతే కాదు విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఎంతో మంది అభిమానులనూ సంపాదించుకుంది.
అయితే సమంత రూత్ ప్రభు ‘యశోద’ చిత్రం తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకునేందుకు ఏడాదిగా ప్రత్యేకంగా చికిత్స పొందుతోంది.
ప్రస్తుతం పూర్తిగా కోలుకుందని తెలుస్తోంది. త్వరలో తిరిగి కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ కానుంది. ఈ క్రమంలో సామ్ ఆయా ఈవెంట్లకు వెళ్తూ సందడి చేస్తోంది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో జరిగింది.
ఈ సందర్బంగా అభిమానులకు తన గురించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేసింది. సామ్ కు యాక్టింగ్ లో రోల్ మోడల్ ఎవరో తాజాగా రివీల్ చేసింది. తననే ఇన్ స్ఫైర్ అవుతానని చెప్పింది.
ఇంతకీ ఆయనెవరో కాదు... మన ఐకాన్ స్టార్ అల్లు అర్జునే (Allu Arjun) కావడం విశేషం. బన్నీ నుంచే ఆమె నటన మెళకువలు నేర్చుకుంటానని చెప్పారు. ఇక వీరిద్దరూ కలిసి ‘పుష్ప’ (Pushpa)లో ‘ఊ అంటావా మావ’ సాంగ్ కు దుమ్ములేపిన విషయం తెలిసిందే. నెక్ట్స్ బన్నీ నుంచి Pushpa 2 The Rule రాబోతోంది.