చైతన్య పేరును పూర్తిగా చెరిపేసిన సమంత, అక్కడుండాల్సిన పచ్చబొట్టుతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..
సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) గురుతులను ఒక్కొక్కటిగా చెరిపివేస్తూ వస్తున్నారు. ఈమధ్య వాళ్లిద్దరు కలుస్తారంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ.. తాజాగా సమంత చేసిన పనికి అంతా అవాక్ అవుతున్నారు.
samantha tattoo
పచ్చబొట్టు చెరిగిపోదులే.. నా రాజ అంటూ.. ఎప్పుడో విడిపోయిన ప్రేమికులను ఆ పంచ్చబొట్టు కలపడం పాత సినిమాల్లో చూశాం. ఇక అదే పచ్చబొట్టును కూడా అవసరమైతే చెరిపివేసి.. మాజీ భార్త ఆనవాళ్లు లేకుండా చేయవచ్చు అని నిరూపించింది హీరోయిన్ సమంత. తాజాగా ఆమె ఫోటో షూట్ లో నెటిజన్లు ఓ అద్భుతాన్ని గమనించారు.
ఇప్పుడు సమంత (Samantha) జీవితంలో నాగ చైతన్య (Naga Chaitanya) లేరు. ఆయన జీవితంలో ఆమె లేరు. వారి మధ్య ప్రేమ బంధం, పెళ్లి బంధం లేదు.. ఇక ఒకరి గురుతులు మరొకరికి ఎందుకు అనుకున్నారో ఏమో.. కష్టతరమైనవి కూడా సాధ్యం చేస్తూ.. తన ఇంటిపై చైతన్య పేరును సమంత చెరిపేశారు.
విడాకుల తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. కొంత మంది సమంతకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది నాగచైతన్యకు సపోర్ట్ చేశారు. అయితే సమంత మాత్రం ముక్కుసూటి మనిషి.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయంలో తనపై ఎక్కువగా విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా వివరణ కూడా ఇచ్చింది సమంత.
పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సమంత,నాగ చైతన్యలు..జీవితాతం హ్యాపీగా ఉంటారు అని అంతా అనుకన్నారు. ఒకరిపై మరొకరి ప్రేమ ఏ రేంజ్ లో చూపించేవారంటే.. సమంత అయితే చైతూకు సబంధించి.. తమ ప్రేమకు సబంధించి మూడు టాటూలను ఒంటిపై వేయించుకుంది.
సమంత ఒంటిపై మూడు టాటూలు కనిపించేవి. చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా 'ఏ మాయ చేసావే'కి గుర్తుగా మెడకి కొంచెం కిందకు... వీపు మీద 'YMC' అని ఓ టాటూ ఉంటుంది. మరొకటి మణికట్టు మీద ఉంటుంది! బాణం గుర్తు తరహాలో ఉండే ఆ టాటూ రోమన్ సింబల్ అట! డీకోడ్ చేస్తే మ్యారీడ్ డేట్ వస్తుందట! ఆ రెండూ పక్కన పెడితే... సమంత పక్కటెముకలు (రిబ్స్) మీద మరో టాటూ ఉంటుంది. అదే చై అనే అక్షరం.
సమంత చాలా ఇష్టంగా పెంచుకునే కుక్క రీసెంట్ గా నాగచైతన్య దగ్గర ప్రత్యక్షం అయ్యింది. దాంతో వీరి మధ్య సీక్రేట్ గా బంధం నడుస్తోంది. అంటూ కామెంట్లు వినిపిస్తున్న క్రమంలో సమంత అసలు టాటూ కూడా తీసేసి కనిపించడంతో.. వీరు కలవడం కష్టమని తేలిపోయింది. మరి ఈ విషయంలో నిజా నిజాలు ఎవరికీ క్లారిటీ లేదు.. అయితే సమంత, లేకుంటే నాగచైతన్యకే తెలియాలి.