సమంత ప్లాస్టిక్ బ్యూటీ..పూజా ఫ్యాన్స్ కామెంట్.. ఇద్దరి అభిమానుల మధ్య వార్!
First Published Jan 5, 2021, 3:33 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరోగా నాగచైతన్య భార్య, ప్రస్తుతం `సామ్‌జామ్`తో హోస్ట్ గా రాణిస్తున్న సమంతపై మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంతది అసలైన అందం కాదట. ప్లాస్టిక్ అందంగా పిలుస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇది ఇద్దరి భామల అభిమానుల మధ్య పెద్ద వార్‌కి తెరలేపింది.

జనరల్‌గా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. కానీ ఫస్ట్‌టైమ్ ఇద్దరు హీరోయిన్ల అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. సమంత, పూజా హగ్డే అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ షురూ అయ్యింది.

అయితే ఇది గతేడాది సమ్మర్‌లోనే జరిగింది. అప్పుడే పెద్ద దుమారం రేపింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ఊపందుకుంది. సమంతపై పూజా హెగ్డే ఫ్యాన్స్ కామెంట్ చేయడంతో అది సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పూజా అభిమానులపై విరుచుకుపడుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?