- Home
- Entertainment
- Samantha: సమంతా మజాకా.. హోరెత్తిన క్రికెట్ స్టేడియం, 'ఊ అంటావా మావ' అంటూ ఊగిపోయిన ఫ్యాన్స్
Samantha: సమంతా మజాకా.. హోరెత్తిన క్రికెట్ స్టేడియం, 'ఊ అంటావా మావ' అంటూ ఊగిపోయిన ఫ్యాన్స్
సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. యశోద, శాకుంతలం, ఖుషి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత నటిస్తోంది.

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో సామ్ ఫ్యాన్స్ ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు.
నాగ చైతన్యతో సమంత విడిపోయాక సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. యశోద, శాకుంతలం, ఖుషి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత నటిస్తోంది. ఇక సమంత పుష్ప చిత్రంతో ఐటెం సాంగ్స్ కూడా షూరూ చేసింది. పుష్ప చిత్రంలో సామ్ 'ఊ అంటావా మావ' అంటూ మత్తుగా అందాలతో ఆకట్టుకుంటూ వేసిన స్టెప్పులని ఫ్యాన్స్ ఇంకా మరచిపోలేకున్నారు.
ఊ అంటావా సాంగ్ మానియా ఖండాలు దాటుతోంది. పుష్ప చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. సమంత ఐటెం సాంగ్ అయితే ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్ క్రేజ్ ఎలాంటిదో చెప్పే సంఘటన ఒకటి జరిగింది. ఆగష్టు 7న ఫ్లోరిడాలో ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య చివరి టి 20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ మధ్యలో 'ఊ అంటావా మావ' సాంగ్ ప్లే చేశారు. దీనితో అక్కడున్న ఇండియన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊగిపోయారు. ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ స్టేడియంని హోరెత్తించారు.
ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోల్ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో సామ్ తొలిసారి ఐటెం సాంగ్ చేసింది.
ఈ సాంగ్ వివాదాలు కూడా సృష్టించింది. మగవాళ్ళని టార్గెట్ చేసేలా ఈ పాట ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్ప మొదటి భాగం కోసం సమంతతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.. పుష్ప ది రూల్ కి ఎలాంటి ప్లాన్స్ రచిస్తున్నారో వేచి చూడాలి.