బాలీవుడ్ యంగ్ హీరోకు ఛాలెంజ్ విసిరిన సమంత, ఇండస్ట్రీలో అసలేం జరుగుతుంది.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోకే ఛాలెంజ్ విసురుతుంది సమంత. టాలీవుడ్ తో పాటు బాలీవుడ, హాలీవుడ్ ఆఫర్లు అందుకున్న సామ్ సరికొత్త ఛాలెంజ్ కు సై అంటుంది. ఇంతకీ ఇండస్ట్రీలో పాకుతున్న ఈ కొత్త ఆచారం ఏంటీ..?

ఇప్పటి వరకు మన దగ్గర గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా ఫేమస్. సినిమా తారల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరు పాల్గొంటున్నారు. కాన ఇప్పుడు ఫిల్మ్ సెలబ్రెటీలలో.. ముఖ్యంగా యంగ్ స్టార్స్ లో కొత్త ఛాలెంజ్ మొదలయ్యంది. ఇప్పుడు సెలబ్రిటీల్లో ఎటాక్ ఛాలెంజ్ నడుస్తోంది. ఈ ఎటాక్ ఛాలెంజ్‌తో సినీ తారలు మరింత ఫిట్‌గా మారనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఛాలెంజ్ ను కంప్లీట్ చేసింది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సామ్... అలాగే సోషల్ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో తెగ హడావిడి చేస్తుంది. క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సమంత వర్కౌట్ విషయంలో మాత్రం పక్కాగా ఉంటుంది.
రీసెంట్ గా తన ఇన్ స్టా ఫేజ్ లో వర్క్ అవుట్ వీడియో షేర్ చేసింది శ్యామ్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సామ్ హై ఆక్టేన్ వర్క్ అవుట్ చేస్తూ కనువిందు చేసింది. ఈ వర్క్ అవుట్ వీడియోను ఎటాక్ ఛాలెంజ్‌లో భాగంగా షేర్ చేసింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు.
దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. అటు అర్జున్ కపూర్ కూడా ఈ ఛాలెంజ్ పై స్పందించాడు. సమంత వర్కౌట్ వీడియోకు ఫిదా అయ్యాడు అర్జున్ కపూర్. కాకపోతే ఇంతలా తాను చేయలేనని ఒప్పేసుకున్నాడు.
సామ్ పోస్ట్ పెడుతూ.. తనకు సవాలు విసిరినందుకు టైగర్ ష్రాఫ్ కు థ్యాక్స్ చెప్పింది. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా. చూద్దాం మీరు ఎలా చేస్తారో. అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు నేను కచ్చితంగా ఇలా చేయలేను అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు.
కాగా ఈ ఎటాక్ ఛాలెంజ్‌ను టైగర్ ష్రాఫ్‌కు కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సవాలు విసిరింది. తర్వాత వారి వెర్షన్‌లను చూపించమని సమంత, నిర్మాత జాకీ భగ్నానీలను నామినేట్ చేశాడు టైగర్ ష్రాఫ్. ఈ ఛాలెంజ్ ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసింద సమంత. ప్రస్తుతం బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ ఛాలెంజ్ లో ఎంత మంది పార్టిస్పేట్ చేస్తారో చూడాలి.