MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత- నాగచైతన్యను కలపాలని ఆ దర్శకుడి ప్రయత్నం, సామ్ ఓకే మరి చైతూ సంగతేంటి...?

సమంత- నాగచైతన్యను కలపాలని ఆ దర్శకుడి ప్రయత్నం, సామ్ ఓకే మరి చైతూ సంగతేంటి...?

సమంత - నాగచైతన్య కలిస్తే బాగుండు అని చాలామంది ఫ్యాన్స్ ఆపడుతున్నారు. కనీసా వీరిద్దరు అన్నీ మర్చిపోయి.. కలిసి నటిస్తే బాగుండు అని అనుకునేవారు కూడా ఉన్నారు. త్వరలో వీరి ఆశ తీరబోతున్నట్టు తెలుస్తోంది. సమంత ‌ -  నాగచైతన్య  కలవబోతున్నట్టు సమాచారం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2022, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నాగచైతన్య - సమంత విడాకులు తీసుకుని విడిపోయి ఏడాది కావస్తోంది. ఇంకా వీళ్లు కలిస్తే బాగుండు అనుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్.  కనీసం కలిసి సినిమాల్లో నటిస్తే బాగుండు అనుకునేవాళ్లు కూడా లేకపోలేదు. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరిని కలిపేందుకు ఒక దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

27

గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి చేసిన సినిమా  ఏం మాయ చేసావే.  ఈ సినిమాతోనే ఈ ఇద్దరు తేరంగేట్రం చేవారు అంతే కాదు  ఈ సినిమానే ఈ ఇద్దరు స్టార్ల  ప్రేమకు పునాది వేసింది. అనూహ్యంగా ఈ సినిమా ఇద్దరి కెరియర్ని మలుపు తిప్పేసింది. సూపర్  హిట్ అయింది.  అయితే ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

37

ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్టు గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలోచెప్పారు. దాంతో మరోసారి  సమంత - నాగచైతన్య పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు వీరు అయితేనే న్యాయం చేయగలరు.. మరొక జంటతో చేస్తే.. హిట్ అవుతుందన్న నమ్మకం లేదు. మరి వీరు ఈసినిమా చేయడానికి కోఆపరేట్ చేస్తారా..? లేదా అనేది తెలియదు 
 

47

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతం ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తుంది. గతంలో నాగచైతన్య కి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. ఆ టైం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని ..నో అయితే చెప్పనన  నాగచైతన్య చెప్పారు.  

57

ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందని అంటున్నారు సినిమా జనాలు.  ఈ క్రమంలోనే ఇద్దరు గత తీపి గురుతులు పంచుకుని ఒకటైతే బాగుంది అనుకుంటున్నారు. ఈ విషయంలో నెటిజన్లు రకరకాల  కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కాంబో సట్ అవుతుందా లేదా అని.  ఏం మాయ చేసావే 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందట, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. 

67

పట్టుమని పది సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండా విడిపోయారు నాగచైతన్య -  సమంత. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట... 2017 లో పెళ్లి పీఠలెక్కారు. మూడేళ్లకు పైగా ఎంతో అన్యోగ్యంగా ఉన్న ఈ ఇద్దరు.. ఏడాది పాటు మనస్పర్థలతో ఇబ్బంది పడ్డారు. ఆతరువాత ఒక నిర్ణయానికి వచ్చి.. విడాకులు తీసుకున్నారు. 

77
Samantha Naga chaitanya

Samantha Naga chaitanya

వీరి విడాకుల గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సమంత బోల్డ్ ఫోటో షూట్స్ కారణమని, చెపితే ఆమె వినలేదంటూ కొందరు.. కాదు కాదు సమంత పర్సనల్ అసిస్టెంట్ తో చనువుగా ఉండటం కారణమని మరికొందరు.. అంతే కాదు నాగచైతన్యకు మరో హీరోయిన్ తో లింక్ ఉందని.. అదే వీరి మధ్య గొడవకు కారణం అని.. ఇలా రకరకాల  రీజన్స్ వినిపించాయి కాని ఇంత వరకూ వారి విడాకులకు అసలు కారణం తెలియలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved