వావ్.. జీన్స్ ప్యాంట్ అండ్ టైట్ టాప్ లో సమంత స్టైల్ అదిరిందిగా.. ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోస్
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొన్ని రోజులు అక్కడ చికిత్స తీసుకుని తిరిగి వచ్చింది.
ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.
అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు.
మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది.
దీనితో సమంత త్వరగా ఫుల్ ఎనేర్జితో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్ లో సమంత ముఖంలో మార్పులు కనిపించాయి.
మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. దీనితో ఓ అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది
. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది. మయో సైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయట పడలేదు.
అయితే తాజాగా సమంత ముంబైలో మెరిసింది. అదిరిపోయే జీన్స్ ప్యాంట్, గ్రీన్ టాప్ లో సమంత కిరాక్ లుక్ లో మెరిసింది. సమంత స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సమంత అభిమానులకు, ఫోటో గ్రాఫర్లకు అభివాదం చేస్తూ అదరహో అనిపించేలా పబ్లిక్ లో మెరిసింది. అయితే సమంత త్వరగానే మరో చిత్రం చేస్తుందా లేకుండా ఇంకాస్త సమయం తీసుకుంటుందా అనేది చూడాలి.