MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • సమంత వెనుక భారీ స్కామ్, కోట్ల రూపాయలు మాయం ? అసలేం జరిగింది..

సమంత వెనుక భారీ స్కామ్, కోట్ల రూపాయలు మాయం ? అసలేం జరిగింది..

ఖుషి తర్వాత సమంత నుంచి మరో చిత్రం రాలేదు. ఆమె చేతిలో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. అయితే సమంత పూర్తిగా వెబ్ సిరీస్ లకు పరిమితం అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. చివరగా సమంత నుంచి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 19 2025, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

ఖుషి తర్వాత సమంత నుంచి మరో చిత్రం రాలేదు. ఆమె చేతిలో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. అయితే సమంత పూర్తిగా వెబ్ సిరీస్ లకు పరిమితం అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. చివరగా సమంత నుంచి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పుడు కూడా సమంత వెబ్ సిరీస్ లోనే నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరు రక్త్ భ్రమండ్. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకులు కానప్పటికీ వాళ్ళ పర్యవేక్షణలోనే రూపొందుతోంది. నెట్ ఫ్లిక్స్, డీ2ఆర్ సంస్థలు కలసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. రహి అనిల్ బర్వె దర్శకుడు. రాజ్ అండ్ డీకే ద్వయంలో సమంత రాజ్ తో క్లోజ్ గా ఉంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపించడంతో రూమర్స్ కి బలం చేకూరుతోంది. 

35

అయితే రక్త్ భ్రమండ్ ప్రాజెక్ట్ వెనుక పెద్ద స్కామ్ జరిగినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ లో ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 26 రోజుల షూటింగ్ జరిగిందట. కనీసం 30 శాతం కూడా షూటింగ్ పూర్తయి ఉండదు. ఇంతలోనే ఈ వెబ్ సిరీస్ కి కేటాయించిన బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనితో నెట్ ఫ్లిక్స్, డీ2 ఆర్ సంస్థలు కంగుతిన్నాయి. కోట్ల బడ్జెట్ 26 రోజుల్లోనే ఎలా అయిపోయింది అని విచారణ మొదలు పెట్టారు. 

45

ఇంత భారీ స్కామ్ వెనుక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. నిజాలు నిగ్గు తేలేవరకు షూటింగ్ ని వాయిదా వేశారట. దీనితో సమంత రక్త్ భ్రమండ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు అయింది. బడ్జెట్ వృధా కావడానికి దర్శకుడు రహి అనిల్ కూడా ఒక కారణం అని చెబుతున్నారు. అతడు ఎప్పటికప్పుడు కథలో మార్పులు చేయడం వల్ల కూడా బడ్జెట్ అయిపోయినట్లు తెలుస్తోంది. 

55
samantha divorce

samantha divorce

ఫ్యామిలీ మాన్ లాంటి భారీ వెబ్ సిరీస్ లని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే పర్యవేక్షణలో ఇలా జరగడం అంటే షాకింగ్ అనే చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Recommended image2
Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే
Recommended image3
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved