- Home
- Entertainment
- సమంత మోస్ట్ డిజైరెబుల్.. జాన్వీ, సారాల విషయంలో భయమేస్తోంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్..
సమంత మోస్ట్ డిజైరెబుల్.. జాన్వీ, సారాల విషయంలో భయమేస్తోంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లపై క్రేజీగా కామెంట్స్ చేశారు.

హిందీ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee with Karan)కి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ గా కొన్నేండ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. లేటెస్ట్ సీజన్ లో ‘లైగర్’ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్ట్ గా హాజరయ్యారు.
బోల్డ్ షోగా పేరొందిన ‘కాఫీ విత్ కరణ్’లో Vijay Deverakondaను కరణ్ జోహార్ అడిగిన కొన్ని ప్రశ్నలకు క్రేజీగా ఆన్సర్స్ ఇచ్చాడు. ఓ లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ తో పాపులారిటీని సొంతం చేసుకుంటున్న ‘లైగర్’ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంటాడు. అలాగే ప్రతి విషయంలో ముక్కు సూటిగా మాట్లాడుతుంటాడు.
లేటెస్ట్ సీజన్ లోనూ అదే జరిగింది. విజయ్ కి కరణ్ జోహార్ అత్యంత బోల్డ్ గా ప్రశ్నలు సంధించారు. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు అంటే నీకు ఇష్టమా అని అడిగారు. ఇప్పటికే వీరిద్దరికీ విజయ్ క్రష్ ఉన్న విషయాన్ని ఇదే షోలో వెల్లడించిన విషయం తెలిసిందే. సారా అలీ ఖాన్ డేట్ కు కూడా వెళ్తానని నిర్భయంగా చెప్పిన సంగతి విధితమే.
కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ బదులిస్తూ.. ‘సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్’విషయం ఎక్కడి వరకు వెళ్తుందోనని భయపడుతున్నాను. వారిద్దరూ నిజంగా దయ కలిగిన మరియు మధురమైన వారు. అంటూ బదులిచ్చాడు. ఆ వెంటనే వీరిద్దరిలో ఎవరూ ఎక్కువగా హాట్ గా కనిపిస్తారని కరణ్ ప్రశ్నించగా.. ఇద్దరూ ఆకర్షణీమైన వారేనని ఆన్సర్ చేశాడు.
ఇక భారతదేశంలో అత్యంత ఇష్టపడే మహిళ పేరు చెప్పమని విజయ్ ని అడగడంతో.. సమంత రూత్ ప్రభు సమాధానమిచ్చాడు. సమంతను డార్లింగ్ గా, అద్భుతమైనదిగా, శక్తివంతమైన లేడీగా, కావాల్సిన వ్యక్తిగా అభివర్ణించాడు. సారా అలీ ఖాన్ ‘చమత్కారం మరియు ఫన్నీ’గా.. జాన్వీని ‘క్యూట్’అని అభివర్ణించాడు. మొత్తంగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ర్యాపిడ్ ఫైర్ లో క్రేజీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో ఆకట్టుకున్నారు.