Samantha: నా పిచ్చికి అదే మందు... సమంత సంచలన సోషల్ మీడియా పోస్ట్
సమంత కోలుకున్నట్లు వార్తలు వస్తుండగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నా పిచ్చికి అదే మందు అంటూ ఆమె షేర్ చేసిన కోట్ వైరల్ అవుతుంది.
సమంత మయోసైటిస్ వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని గత ఏడాది అక్టోబర్ నెలలో అభిమానులకు తెలియజేశారు. సమంత ప్రకటన చిత్ర వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అందరూ విషెస్ చెప్పారు.
Samantha
సమంత(Samantha) పూర్వస్థితికి వచ్చేందుకు సమయం పడుతుంది. ఆమె మెరుగైన చికిత్స కోసం దేశ విదేశాలు తిరుగుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మీడియా వార్తలు ఆమె అభిమానులను మరింత ఆందోళనకు గురి చేశాయి. అయితే సన్నిహిత వర్గాల సమాచారం మేరకు సమంత కోలుకున్నారు. తిరిగి ఆమె కెమెరా ముందుకు రానున్నారు.
సమంత సన్నిహితులు మీడియాకు చెప్పిన మాట వాస్తవమే అనిపిస్తుంది. ఆమె వర్క్ లో బిజీ అయ్యారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ జనవరి 17న విడుదల కానుంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటుంది.
Samantha
శాకుంతలం(Shakuntalam) చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి ఒక ఆసక్తికర కోట్ జోడించారు. ''నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటికి కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను'' అని రచయిత నిక్కీ రో రాసిన కోట్ పంచుకున్నారు.
తన జీవితానికి ఈ కోట్ సరిపోతుందని ఆమె భావన. ఇక తనకు ఇష్టమైన సినిమా కళలో, పనిలో నిమగ్నమై కష్టాలు, నష్టాలు, బాధలు మర్చిపోతానని సమంత చెప్పకనే చెప్పింది. తన అనారోగ్యానికి కూడా సినిమానే మందని సమంత పరోక్షంగా వెల్లడించారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.
కాగా యశోద చిత్రానికి కూడా సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అప్పటికే అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఇంటి నుండే డబ్బింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు శాకుంతలం చిత్రానికి సైతం అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఆ సెంటిమెంట్ కలిసొస్తే శాకుంతలం కూడా హిట్టే.
కాగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సమంత ఖుషి టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ జరుపుకుందట. త్వరలో మిగిలిన షూటింగ్ సైతం సమంత కంప్లీట్ చేయనున్నారట.
శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. మోహన్ దేవ్ సమంతకు జంటగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వర్షిణి, అనన్య నాగళ్ళ కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం.