Samantha: నాకు ముందే తెలుసు, నాగ చైతన్య హీరోయిన్ పై సమంత ఊహించని కామెంట్స్
సినిమాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా సమంత గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంటోంది.
సినిమాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా సమంత గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంటోంది. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సమంత విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సమంత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
Samantha
దీనితో సమంత ఇటీవల ఎక్కువగా సినిమాలు చేయలేదు. గత ఏడాది సమంత నటించిన చిత్రాలు శాకుంతలం, ఖుషి. ఈ రెండు రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడిప్పుడే సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సమంత ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒత్తిడి వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు మొదలైనట్లు పరోక్షంగా తెలిపింది. మరో విషయం కూడా బయటకి వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు మరో హీరోయిన్ ని పొగడడం చాలా అరుదు.
అయితే సమంత మాత్రం ఒక హీరోయిన్ ని ప్రశంసలతో ముంచెత్తింది. మలయాళీ బ్యూటీ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవిపై సమంత కామెంట్స్ చేసింది. ఓ వేదిక పై మాట్లాడుతూ సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి డ్యాన్స్ అంటే తనకి పిచ్చి అన్నట్లుగా సమంత పేర్కొంది. సాయి పల్లవి గొప్ప డ్యాన్సర్ అని నాకు ముందే తెలుసు.
గతంలోనే సాయి పల్లవి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చినప్పుడు చూశా.నేనైతే చూపు తిప్పుకోలేకపోయా అని సమంత పేర్కొంది. ఒక హీరోయిన్ గురించి మరో హీరోయిన్ ఇంతలా ప్రశంసలు కురిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య పాన్ ఇండియా చిత్రం 'తండేల్' లో నటిస్తోంది.
వీళ్ళిద్దరూ ఆల్రెడీ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. లవ్ స్టోరీ మూవీ మంచి విజయం సాధించింది. తండేల్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాకిస్తాన్ లో చిక్కుకు పోయిన తెలుగు మత్స్య కారుడిగా నాగ చైతన్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు.