విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై.. సమంత కామెంట్స్, నిజమేనన్న రౌడీ హీరో..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కాబోయే భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్ సమంత. ఆమె కామెంట్స్ కు విజయ్ కూడా నిజమేనంటూ సమాధానం ఇచ్చాడు. ఇంతకీ సమంత ఏమని కామెంట్స్ చేసింది.

విజయ్ దేవరకొండకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెపుతూ.. సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం.. వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ కు విజయ్ కూడా అవును అని సమాధానం చెప్పడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సమంత చేసిన కామెంట్స్ ఏంటీ.. విజయ్ ఎందుకు నిజమే అని అన్నాడు. విజయ్ దేవరకొండకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి..? సమంత ఏం చెప్పింది..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోడీగా సమంత నటించిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1న ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈమూవీలో భార్య భర్తలుగా నటించారు ఇద్దరు స్టార్లు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు.. మూవీ ప్రమోషన్ వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ప్రమెషన్ల జోరు పెంచారు ఖుషీ టీమ్.
ఈసినిమా ప్రమోషన్లలో భాగంగా.. విజయ్ దేవరకొండ, సమంత వరుసగా ఈవెంట్లు.. ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్కూలో పాల్గొన్నారు ఈజంట. ఈ క్రమంలో విజయ్ గురించి సమంత.. సమంత గురించి విజయ్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈక్రమంలోనే విజయ్ కాబోయే భార్య ఎలా ఉండాలో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విజయ్ కు కాబోయే భార్య చాలా సింపుల్ గా ఉండాలి.. అతని కుటుంబంలో కలిసి పోవాలి.. వారిలో ఒకరిగా ఉండాలి. అదే విజయ్ కూడా కోరుకుంటున్నాడు అని సమంత చెప్పింది. సమంత కామెంట్స్ కు విజయ్ కూడా అవును నిజమే అని సమాధానం చెప్పాడు. అంతే కాదు విజయ్ ఫోన్ తక్కువ మాట్లాడతాడని.. ఎక్కువ మెసేజ్ లు చేస్తాడన్నారు సమంత. విజయ్ కు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ.. గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడంటూ కామెంట్స్ చేసింది సమంత.
ఇక సమంత గురించి విజయ్ కూడా మాట్లాడారు. రాహుల్, చిన్మయి, నీరజ కోన, మేఘన ఇలా సమంత కు కొంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అని విజయ్ వెల్లడించాడు. అంతే కాదు సమంతకు రకరకాల వంటలు ఆస్వాదించడమంటే చాలా ఇష్టం. ఏ విషయంలో అయినా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కోపం వచ్చినా అసభ్యంగా మాట్లాడదు అంటూ.. సమంత గురించి విజయ్ కామెంట్స్ చేశాడు.
ఇక శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్న విజయ్, శాకుంతలంతో ప్లాప్ చూసిన సమంత, టక్ జగదీష్ తో ప్లాప్ అందుకుని సాలిడ్ హిట్ కోసం చూస్తున్న డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఖుషీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రమోషన్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు టీమ్.
ఇక రీసెంట్ గా ఖుషీ మూవీ మ్యూజిక్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో సమంతతో కలిసి విజయ్ డాన్స్ కూడా చేశారు. షర్ట్ విప్పి విజయ్ చేసిన రచ్చ.. సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ విషయంలో విజయ్, సమంతపై దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ప్రస్తతం ఈసినిమా రిలీజ్ పై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.