Samantha Pushpa 2: `పుష్ప 2`లో సమంత.. ఆ సెంటిమెంట్ కోసం సుకుమార్ ప్లాన్.. బన్నీ రిస్క్ తీసుకుంటాడా?
ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన `పుష్ప`కి రెండో పార్ట్ `పుష్ప 2` షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో సమంత నటించబోతుందనే వార్త ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది.
pushpa 2
ఐకాన్ స్టార్ Allu Arjun బ్యాక్ టూ బ్యాక్ రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చాడు. `అల వైకుంఠపురములో` తో రచ్చ చేసిన ఆయన `పుష్ప` (Pushpa) చిత్రంతో నాన్ `బాహుబలి` రికార్డ్ లు తిరగ రాశారు. `అల వైకుంఠపురములో` రెండు వందల కోట్లు వసూలు చేయగా, `పుష్ప` కరోనా సమయంలో విడుదలై మూడువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి సంచలనంగా మారింది. ఇక `పుష్ప2` తో బాక్సాఫీసు రికార్డ్ ల వేటకు సిద్ధమవుతున్నాడు.
pushpa 2
ఇదిలా ఉంటే Pushpa 2 చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కంటిన్యూ కానుంది. మిగిలిన పాత్రలన్నీ ఉండబోతున్నాయి. విలన్‌గా ఫహద్ ఫాజిల్, అలాగే అనసూయ, సునీల్ పాత్రలు యధావిధిగా ఉండబోతున్నాయి. దీనికితోడు అందాల సీనియర్ తార ఇంద్రజని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేకాదు మరింత డోస్ పెంచబోతున్నారట దర్శకుడు సుకుమార్. ఈ సినిమాకి గ్లామర్ సైడ్ `పుష్ప`ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
pushpa 2
`పుష్ప 2`లో సమంతని తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఆమెని ఏ పాత్ర కోసం తీసుకోబోతున్నారనేది ఆసక్తి నెలకొంది. సమంత కోసం ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్ రోల్ డిజైన్ చేస్తున్నారా? లేక మరోసారి ఐటెమ్ సాంగ్ చేయిస్తారా? అనేది సస్పెన్స్ నెలకొంది.
pushpa 2
ఇదిలాఉంటే ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోబోతున్నారనే వార్త వినిపిస్తుంది. ఆమెతోనూ చర్చలు జరిపారని, గ్లామర్ డోస్ పెంచాలంటే దిశాని దించాల్సిందే అనేలా సుకుమార్ వ్యవహరిస్తున్నారట. బాలీవుడ్‌లోనూ ఆమెకి క్రేజ్ ఉన్న నేపథ్యంలో అది ప్లస్ అవుతుందని భావించారట. కానీ సుకుమార్ మనసు మార్చుకున్నారా? అనే టాక్ కూడా వినిపిస్తుంది.
pushpa 2
సమంత (Samantha)ని దర్శకుడు సుకుమార్ తనకు లక్కీ సెంటిమెంట్‌గా మారింది. `రంగస్థలం`లో ఆమె హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. దర్శకుడిగా ఆ చిత్రంతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత తీసిన `పుష్ప`లో ఐటెమ్ సాంగ్ రూపంలో సమంతని పెట్టి ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేశాడు. దీంతో సమంత తనకు లక్కీ ఛార్మ్ గా మారిందని భావిస్తున్నారట. దీంతోమరోసారి ఆమెని రిపీట్ చేయాలనుకుంటున్నారట. కాకపోతే ఆమెతో ఐటెమ్ సాంగ్ చేయిస్తాడా? లేక మరేదైనా కీ రోల్ చేయిస్తాడా? అనేది సస్పెన్స్ గా ఉంది.
pushpa 2
సమంతకి కూడా `పుష్ప` చాలా హెల్ప్ అయ్యింది. నాగచైతన్యతో విడాకుల అనంతరం బ్యాక్ అయిన ఆమెకి `పుష్ప` పెద్ద బూస్ట్ నిచ్చింది. తన క్రేజ్‌ని చాటి చెప్పింది. ఓ రకంగా సమంతకి కమ్‌బ్యాక్‌కి ఫుల్ ఎనర్జీనిచ్చింది. ఇందులో ఆమె చేసిన సాంగ్‌కి విశేషస్పందన లభించింది. సమంత బోల్డ్ నిర్ణయంతో, హాట్‌గా కనిపించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. ఎంతో మందికి దగ్గరైంది. ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. ఈ పాటతో సమంతకి దక్కిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి `పుష్ప`, దర్శకుడు సుకుమార్ లను ఆమె మరువ లేదు. కాకపోతే ఆమె ఒప్పుకుంటుందా? అనేది సస్పెన్స్ గా ఉంది.
pushpa 2
`పుష్ప`లో ఐటెమ్ సాంగ్‌ని సమంత చేత చేయించడం కోసం అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌వాల్వ్ అయ్యారు. సమంతని ఒప్పించాడు. ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మరోసారి ఆ రిస్క్ బన్నీ తీసుకుంటాడా? హీరోయిన్‌గా అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సమంత `పుష్ప2`లో ఐటెమ్ సాంగ్ కోసమో లేక, హీరయిన్‌గా కాదని కీలక పాత్ర కోసం ఒప్పుకుంటుందా? అనేది చూడాలి.
samantha
ప్రస్తుతం సమంత `శాకుంతలం`, `యశోద` చిత్రాలతోపాటు డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా, ఓ ఇంగ్లీష్ మూవీ, అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తుంది. హిందీలోనూ సినిమాలు చేయబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని షేక్‌చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా సార్లు ట్రోల్స్ కి గురైంది సమంత. అయినా వాటిని ధీటుగా ఎదుర్కొని కెరీర్‌లో ముందుకు సాగుతుంది. నటిగా నెక్ట్స్ లెవల్‌కి చేరుకుంటుంది.