- Home
- Entertainment
- సమంత హెల్త్ అప్‌డేట్.. రోజుకి నాలుగు గంటలు కొత్త ట్రీట్‌మెంట్.. సామ్ వర్కౌట్ వీడియో వైరల్
సమంత హెల్త్ అప్‌డేట్.. రోజుకి నాలుగు గంటలు కొత్త ట్రీట్‌మెంట్.. సామ్ వర్కౌట్ వీడియో వైరల్
సమంత మయోసైటిస్ నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె ప్రతి రోజూ జిమ్‌లో వర్కౌట్ చేస్తూ శ్రమిస్తుంది. పూర్వ స్థితికి ప్రయత్నిస్తుంది. తాజాగా ఆమె హెల్త్ కి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది.

సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. కండరాలకు సంబంధించిన అరుదైన వ్యాధి ఇది. దాదాపు ఏడెనిమిది నెలలుగా సమంత ఈ వ్యాధితో పోరాడింది. అత్యంత క్రిటికల్ స్థితి నుంచి కోలుకుంది. ఇప్పుడు మళ్లీ యదాస్థితికి చేరుకుంటుంది. పోయిన ఫిట్‌నెస్‌ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంది. అందుకు జిమ్‌లో శ్రమిస్తుంది సామ్.
ఓ వైపు వరుసగా ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. బలహీన పడిన శరీరంలో బలాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంది. ఫిట్‌నెస్‌ని తిరిగి పొందుతుంది. అయితే అందుకోసం సమంత కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కఠినమైన వర్కౌట్స్ చూసి అయ్యో పాపం అంటున్నారు ఫ్యాన్స్. ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు. అండగా నిలుస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
తాజాగా మరో వీడియోని పంచుకుంది సమంత. బరువైన జిమ్ పరికరాలతో వర్కౌట్ చేస్తూ కనిపించింది. బలమైన కండరాలతో కనిపించి షాకిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోవైపు సమంత ఆరోగ్యంపై మరో అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం ఆమె స్థితి గురించి, తాను తీసుకుంటున్న థెరపీ గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సమంత.
మయోసైటిస్‌కి సంబంధించిన నెలవారి ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరఫీ) సెషన్‌కి హాజరైనట్టు తెలిపింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది సమంత. అందుకు సంబంధించిన ఓ వీడియో పంచుకుంటూ `న్యూ నార్మల్` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కొత్తగా తాను పూర్వస్థితికి చేరుకున్నట్టు తలెఇపింది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ సమర్దంగా పనిచేయించడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ ఫెక్షన్ భారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. ఇందుకోసం రోజుకూ సుమారు నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌ని తాను ఇంట్లో నుంచే తీసుకుంటుందట సమంత.
ఇక కెరీర్ పరంగా మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటుంది సమంత. ప్రస్తుత ఆమె హిందీలో రూపొందుతున వెబ్ సిరీస్ `సిటాడెల్` రీమేక్‌లో నటిస్తుంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు మార్చి నుంచి తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొనబోతుంది సామ్. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తుంది. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ `శాకుంతలం` ఈ నెల 17న విడుదల కావాల్సింది. కానీ సీజీ వర్క్, థియేటర్ల సమస్య కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన `శాకుంతలం`లో సమంతతోపాటు దేవ్ మోహన్ నటిస్తున్నారు. బన్నీ కూతురు అల్లు అర్హ బాల భరత్ పాత్ర పోషిస్తుంది.