- Home
- Entertainment
- Samantha: కెరీర్ పరంగా ఈ 6 అంశాల్లో సమంత బర్త్ డే ఈ సారి ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా?
Samantha: కెరీర్ పరంగా ఈ 6 అంశాల్లో సమంత బర్త్ డే ఈ సారి ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా?
స్టార్ హీరోయిన్ సమంత నేడు(ఏప్రిల్ 28)న తన 35వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. కానీ ఆరు అంశాల్లో మాత్రం సమంత ఈ బర్త్ డే చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. తన జీవితంలోనే ప్రత్యేకంగా నిలవబోతుంది.

samantha birthday special
సమంత(Samantha).. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అనుభవిస్తుంది. తిరుగులేని కథానాయికగా రాణిస్తుంది. కెరీర్ పరంగా రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతుంది. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసింది. వాటన్నింటిని చిరునవ్వుతో ఎదుర్కొంది. సమస్యలపై పోరాడింది. నేడు ఎంతో మంది నటీమణులకు, అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే గతేడాది వరకు చైతూతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న సమంత ఈ సారి మాత్రం ఒంటరిగా పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇలా ఓ ఆరు అంశాల్లో ఈ సారి సమంత పుట్టిన రోజు ఆమె కెరీర్‌లో, జీవితంలో చాలా స్పెషల్ గా నిలుస్తుంది. Samantha Birthday.
samantha birthday special
మొదటగా.. సమంత, భర్త నాగచైతన్య(Naga Chaitanya) గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. విడిపోవడానికి కారణాలు ఇప్పటికీ తెలియనప్పటికీ, ఈ ఇద్దరు విడిపోవడం అందరిని షాక్‌కి గురిచేసింది. వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సమంత కూడా తనలైఫ్‌లో చాలా కఠినమైన రోజులను ఎదుర్కొంది. ఈ రకంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జరుపుకుంటున్న తొలి బర్త్ డేగా ఈ 35వ పుట్టిన రోజు నిలుస్తుంది. అందుకే ఇది స్పెషల్.
samantha birthday special
సమంత కెరీర్‌లోనే మొదటిసారి తన పుట్టిన రోజున తాను నటించిన సినిమా విడుదల కావడం విశేషం. సమంత తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి `కాతు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటించింది. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 28) సమంత బర్త్ డే సందర్భంగా తెలుగు తమిళంలో విడుదలైంది. ఈ సినిమా, ఈ బర్త్ డే సమంతకి ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
samantha birthday special
మరోవైపు సమంత కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పౌరాణిక చిత్రాలు చేస్తుంది. `శాకుంతలం`(Shaakuntalam) అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా శకుంతలగా సమంత నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలోని సమంత కొత్త లుక్‌ని విడుదల చేశారు. దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా, పాలరాతి బొమ్మలా ఉంది సమంత. ఆమె సరికొత్త లుక్ కట్టిపడేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ కూతురు అల్లు అర్హ బాల నటిగా పరిచయం కాబోతుండటం విశేషం. దీంతోపాటు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది సమంత.
samantha birthday special
సమంత నటించిన `యశోద` పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటం విశేషం. గతంలో `ది ఫ్యామిలీ మ్యాన్ 2` పాన్ ఇండియాలో విడుదలైనా, సినిమా మాత్రం `యశోద`నే పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతుంది. అలా ఇది సమంతకి తొలి పాన్ ఇండియా సినిమా కాబోతుంది. మరోవైపు ఇంటర్నెషనల్ సినిమా కూడా చేస్తుంది సమంత. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఓ కమర్షియల్ సినిమా చేస్తుంది. అంతేకాదు ఒకేసారి ఐదు సినిమాలకు సమంత కమిట్ కావడం ఈ బర్త్ డే విశేషం.
samantha birthday special
సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, చాలా పవర్‌ఫుల్ లేడీ కూడా. జీవితంలో ఆటుపోట్లని ఎదుర్కొని, కన్నీళ్లని దిగమింగుకుని తనని తాను పాన్ ఇండియా స్టార్‌గా మలుచుకున్న కథానాయిక. మహిళా సాధికారతకి నిలువెత్తు నిదర్శనం. నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా, తెలిసిన మహిళగా ఎదిగింది సమంత. అందుకే ఈ బర్త్ డే ఆమెకి చాలా స్పెషల్.
samantha birthday special
దీంతోపాటు సమంత ఇప్పుడు బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. తనకు నచ్చిన విధంగా జీవిస్తుంది. జీవితంలో ఫస్ట్ టైమ్ సమంత చాలా ఓపెన్‌గా, ధైర్యంగా, ఎలాంటి బంధనాలు లేకుండా ఉన్న రోజులివి. సినిమాల పరంగానూ, వ్యక్తిగత విషయాల్లోనూ చాలా బోల్డ్ గా ఉంటుంది సమంత. విమర్శలను లెక్క చేయకుండా జీవితంలో తాను ఏం సాధించాలనుకుంటుందో ఆ దిశగా పరుగులు పెడుతుంది. కెరీర్‌ని పరిగెత్తిస్తుంది. అదే సమయంలో విడాకుల తర్వాత సమంత చాలా స్వేచ్ఛగానూ మారింది. ఇంతటి స్వేచ్చ మరెప్పుడూ ఆమె జీవితంలో లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ బర్త్ డే సమంతకి ఎంతో స్పెషల్‌గా ఉండబోతుంది. అదే సమయంలో ఆమెలో బయటకు చెప్పలేనంత బాధ కూడా ఉండటం గమనార్హం. ఈ ఆరు అంశాల్లో సమంత స్పెషల్‌గా నిలుస్తుండటంతో ఈ బర్త్ డే ఆమెకి మరింత స్పెషల్‌గా ఉండబోతుంది.
samantha birthday special
ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత డబ్బుల్లేక చదువు మధ్యలోనే మానేసింది. ఆ తర్వాత తన ఖర్చుల కోసం ఫంక్షన్లలో వెల్‌కమ్ గర్ల్ గానూ పనిచేసింది. ఒక్కో ఫంక్షన్‌కి ఐదు వందలిచ్చేవారు. ఆ తర్వాత మోడల్ రంగంలోకి అడుగుపెట్టి రాణించింది. ఈ సమయంలోనే సమంత సినిమాని కెరీర్‌గా ఎంచుకుంది. `ఏం మాయ చేసావె` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
samantha birthday special
`ఏం మాయ చేసావె` సమయంలోనే నాగచైతన్యతో పరిచయం పెరిగింది. క్రమంగా అది ప్రేమగా మారి 2017లో పెళ్లి వరకు వెళ్లింది. మధ్యలో సిద్ధార్థ్‌తో సమంత డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి. కొన్నాళ్లకే ఆమె బ్రేకప్ చెప్పిందని ఆ మధ్య వార్తలు షికార్ చేశాయి. కానీ తర్వాత నాగచైతన్య, తాను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు. 2017 అక్టోబర్ 6న రెండు(హిందూ, క్రిస్టియన్) సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.