- Home
- Entertainment
- బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సమంత, నాగ చైతన్య మూవీ.. జనం ఎగబడుతున్నారుగా, అసలు ఈ క్రేజ్ ఏంటి..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సమంత, నాగ చైతన్య మూవీ.. జనం ఎగబడుతున్నారుగా, అసలు ఈ క్రేజ్ ఏంటి..
టాలీవుడ్ క్రేజీ కపుల్ గా సమంత, నాగ చైతన్యకి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట 2021లో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ విడిపోయారు.

టాలీవుడ్ క్రేజీ కపుల్ గా సమంత, నాగ చైతన్యకి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట 2021లో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ విడిపోయారు. చాలా కాలం పాటు వీరి బ్రేకప్ ని ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు.
ఏ మాయ చేశావే చిత్రంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మనం, మజిలీ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. 2017లో సమంత, నాగ చైతన్య వివాహం వైభవంగా జరిగింది.వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసే చిత్రం ఏంటి అని అనుమానం రావచ్చు.
వివరాల్లోకి వెళితే.. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం 2091లో విడుదలయింది. మజిలీ ఘనవిజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సమంత, చైతు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదరడంతో ఫ్యాన్స్ థియేటర్స్ కి ఎగబడ్డారు.
మజిలీ చిత్ర క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తూనే ఉంది. కాకపోతే తెలుగులో కాదు.. మరాఠీలో. మజిలీ చిత్రాన్ని మరాఠీలో రీమేక్ చేశారు. ఇక్కడ రియల్ లైఫ్ కపుల్ సమంత, నాగ చైతన్య ఈ చిత్రంలోనటించాగా .. మరాఠీలో రియల్ లైఫ్ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ నటించారు.
డిసెంబర్ 30న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసే విధంగా కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు జరిగిన మ్యాజిక్కే మరాఠీలో కూడా రిపీట్ అయింది. రితేష్, జెనీలియా కెమిస్ట్రీకి మరాఠా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్స్ కి జనం ఎగబడుతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం 50 కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని జెనీలియా నిర్మించగా.. రితేష్ దర్శకత్వం వహించి నటించారు. రితేష్, జెనీలియా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఏది ఏమైనా మజిలీ చిత్రం ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది.