MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చైతు, సమంత విడాకులు: జంటగా అడుగు పెడితే బ్లాక్ బస్టర్ పక్కా, కానీ

చైతు, సమంత విడాకులు: జంటగా అడుగు పెడితే బ్లాక్ బస్టర్ పక్కా, కానీ

చిత్ర పరిశ్రమకు, సినీ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. సమంత, నాగచైతన్య అధికారికంగా విడిపోయారు. తమ వైవాహిక బంధానికి తెరదించారు.

2 Min read
Author : pratap reddy
Published : Oct 02 2021, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిత్ర పరిశ్రమకు, సినీ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. సమంత, నాగచైతన్య అధికారికంగా విడిపోయారు. తమ వైవాహిక బంధానికి తెరదించారు. దాదాపు పదేళ్ల క్రితం వీరిద్దరూ తొలి సారి కలుసుకున్నారు. ఏ మాయ చేసావే చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం వివాహ బంధం వరకు వెళ్ళింది. 2017లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా నేడు ఇద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చాలా రోజులుగా చై సామ్ మధ్య రిలేషన్ సరిగా లేదంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని నిజం చేస్తూ చై సామ్ భార్య భర్తలుగా విడిపోయారు. వీరిద్దరి నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. మొన్నటివరకు కూడా చై సామ్ మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్నారు. వీరిద్దరూ కలసి నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం. 

38

ఏమాయ చేశావే చిత్రం నాగ చైతన్యకు రెండో మూవీ. సమంత ఈ చిత్రంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో చై, సామ్ ఎమోషనల్ రొమాన్స్ యువతని బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో వీరిద్దరూ కిస్సింగ్ సన్నివేశాలతో వార్తల్లో నిలిచారు. 

48

ఆ తర్వాత చైతు, సమంత మరోసారి జంటగా నటించిన చిత్రం అక్కినేని వారి 'మనం'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. చైతు, సమంత ఈ మూవీలో భార్య భర్తలుగా నటించారు. 

58

చై సామ్ కలసి నటించిన చిత్రాలలో నిరాశ పరిచిన చిత్రం ఆటో నగర్ సూర్య మాత్రమే. అప్పటి చైతు ఇమేజ్ ని దాటి కాస్త మాస్ అంశాల కోసం ప్రయత్నించడంతో ఈ చిత్రం నిరాశపరిచింది. కానీ చైతు సామ్ జోడి ఎప్పటిలాగే అలరించారు. ఆటో నగర్ సూర్య చిత్రం తర్వాతే చై సామ్ మధ్య బంధం బాగా బలపడింది. 

68

కట్ చేస్తే 2017లో చైతు సామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయ్యాక వీరిద్దరూ కలసి నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. 

78

ఇక సమంత నటించిన మహానటి, ఓ బేబీ చిత్రాల్లో చైతు కామియో రోల్ పోషించాడు. ఈ రెండు చిత్రాలు కూడా అఖండ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

88

ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో తిరుగులేని జంటగా వెలుగొందిన చై సామ్ విడిపోవడం అభిమానులకు,స్నేహితులు ఊహించని షాక్. కొన్ని వారాలుగా బలమైన రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ చై సామ్ సైలెంట్ మైంటైన్ చేస్తూ వచ్చారు. తాజాగా విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved