- Home
- Entertainment
- `సలార్-పార్ట్ 1` స్టోరీ లీక్.. యూఎస్ ఆర్మీతో యుద్ధమా?.. వామ్మో కథ తెలిస్తే పూనకాలే?
`సలార్-పార్ట్ 1` స్టోరీ లీక్.. యూఎస్ ఆర్మీతో యుద్ధమా?.. వామ్మో కథ తెలిస్తే పూనకాలే?
ప్రభాస్ నటిస్తున్న `సలార్` సినిమా టీజర్ గురువారం విడుదలై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మరో పూనకాలు తెప్పించే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. `సలార్` స్టోరీ లీకింగ్ వార్త రచ్చ చేస్తుంది.

ప్రభాస్ నటించిన మూడు సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. `సాహో`, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` మూవీస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు వస్తోన్న సినిమా `సలార్`. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి పార్ట్ `యుద్ధ విరమణ` టీజర్ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ప్రభాస్ ఊచకోత అదిరిపోయింది. అయితే ప్రభాస్‌ని సరిగా చూపించలేదనే కామెంట్స్ వచ్చాయి. ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినట్టు ఆవేదన చెందారు. కానీ టీజర్ మాత్రం రికార్డు వ్యూస్ సాధించింది. ఇది ఒక్క రోజులో ఇది 83 మిలియన్స్ వ్యూస్‌ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇంకా ఈ రికార్డుల పరంపర సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో `సలార్` సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. సినిమా స్టోరీ లీక్ అనేది రచ్చ చేస్తుంది. `సలార్`స్టోరీ ఇదే అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆ రూమర్స్ ప్రకారం `సలార్` స్టోరీ.. 1980లో జరుగుతుందట. సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఈ సున్నపు రాయి ఫార్మాకి, యూఎస్ ఆర్మీకి లింక్ ఉంటుందట. ఈ క్రమంలో సలార్.. యూఎస్ ఆర్మీతో పోరాడాల్సి వస్తుందని తెలుస్తుంది.
సినిమాలో కొన్ని యాక్షన సీన్లు విదేశాల్లోనూ సాగుతాయని, అందుకోసం ఇటలీలో చిత్రీకరించినట్టు సమాచారం. ఆయా ఎపిసోడ్‌లు సినిమాకిహైలైట్‌గా, నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని సమాచారం. అయితే ఈ కథకి `కేజీఎఫ్2` కథకి సంబంధం ఉంటుందట. ఓ చోట `కేజీఎఫ్2` నుంచి లింక్ ఉంటుందని, ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగమే `సలార్` అని తెలుస్తుంది. `కేజీఎఫ్`, `సలార్`కి దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. `సలార్` టీజర్‌లోనూ `కేజీఎఫ్` కి లింకులున్నాయి, సెట్, టోన్, ఆయుధాలు ఇలా చాలా విషయాలో రెండింటికి లింక్ కనిపిస్తుంది. అయితే `సలార్ 2`లో `కేజీఎఫ్` లింక్ స్పష్టంగా ఉంటుందని, అప్పటి వరకు సస్పెన్స్ మెయింటేన్ అవుతుందని తెలుస్తుంది.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం సంచలనంగా మారుతుంది. ఇదే నిజమైతే ఇక `సలార్`ని ఆపడం ఎవరి తరం కాదని చెప్పాలి. సరికొత్త రికార్డులకు సిద్ధం కావాల్సిందే అని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇక టీజర్ కాస్త డిజప్పాయింట్ చేసినా రికార్డ్ వ్యూస్ సాధిస్తుంది. ఇక ట్రైలర్ ఎన్ని సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందో అనే ఉత్సాహం ప్రభాస్ అభిమానుల్లో కనిపిస్తుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రని పోషిస్తున్నారు. టీజర్‌లో ఆయనని కూడా చివర్లో చూపించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సుమారు 300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. ఐదు ఇండియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. `బాహుబలి2` రికార్డుల టార్గెట్‌గా ఈ సినిమా రాబోతుందని చిత్ర వర్గాల నుంచి వినిపించే టాక్.