- Home
- Entertainment
- Salaar Leak: `సలార్` షూటింగ్ స్పాట్ ప్రభాస్ ఫోటోలు లీక్.. వామ్మో ఇదెక్కడి కటౌట్.. మాస్ కా బాప్..
Salaar Leak: `సలార్` షూటింగ్ స్పాట్ ప్రభాస్ ఫోటోలు లీక్.. వామ్మో ఇదెక్కడి కటౌట్.. మాస్ కా బాప్..
ప్రభాస్ అంటేనే భారీ కటౌట్. ఆయన కటౌట్‌కే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. కానీ `సలార్`లో మాత్రం ఆయన కటౌట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. తాజాగా లీక్ అయిన ఫోటోలలో ప్రభాస్‌ని చూస్తుంటే ఇది వీరలెవల్ అనిపిస్తుంది.

ప్రభాస్(Prabhas) ఇటీవల `రాధేశ్యామ్`(Radheshyam)తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏజ్‌లో లవ్ స్టోరీ అనే సరికి జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ సినిమాకి మాత్రం రూ.200కోట్లకుపైనే కలెక్షన్లు వచ్చాయి. అదే సినిమా బడ్జెట్ తక్కువగా ఉండి ఉంటే హిట్ అకౌంట్‌లో పడేది. కానీ `రాధేశ్యామ్` డిజప్పాయింట్ చేయడంతో ఇప్పుడు అందరి ఆశలు `సలార్`పై పెట్టుకున్నారు.
`కేజీఎఫ్ ` ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఇటీవల `కేజీఎఫ్ 2` బ్లాక్‌బస్టర్ కావడంతో `సలార్`పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇది బాక్సాఫీసు వద్దసునామీనే అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ సినిమా కోసం ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా `సలార్` షూటింగ్ సెట్‌లోని పిక్స్ లీక్ అయ్యారు. ప్రభాస్ మాస్ లుక్‌లో భారీ కటౌట్‌తో కనిపిస్తున్న తీరు గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఈ కటౌట్ చూస్తుంటే మామూలు ఆడియెన్స్ కి కూడా గూస్‌బంమ్స్ వచ్చేలా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్‌గా ఉండబోతుంది. కేజీఎఫ్ తరహాలో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
లీకైన ఫోటోల్లో కోల్ మైనింగ్ తాలుకూ ఛాయలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో భారీ వెహికల్స్ ఉన్నాయి. ప్రభాస్ జిగరేట్ తాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కటౌట్ కి నీల్ ఎలివేషన్స్ పడితే నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు. 'కేజీఎఫ్ 2' కి మించిన మాస్ ని 'సలార్' మూవీలో చూడబోతున్నామనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక మే నెలాఖరున ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 'సలార్' చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు విలన్ రోల్ లో కనిపించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2023 సమ్మర్ సీజన్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
`సలార్` కంటే ముందే ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` విడుదల కాబోతుంది. ఇది వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నారు. ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రంలో కృతి సనన్ కథానాయికగా నటిస్తుంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. దీంతోపాటు మారుతితో ఓ సినిమాని త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌తో `ప్రాజెక్్ట కే `సినిమా చేస్తున్నారు ప్రభాస్