నిండైన చీరలో కూడా మంట పుట్టిస్తున్న శృతి హాసన్... కొంటె చూపులతో చంపేసింది పో...!
సన్నజాజి తీగలా నాజూగ్గా ఉండే శృతి హాసన్ నిండైన చీరలో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కట్టులో కూడా శృతి హాసన్ గ్లామర్ గుండెల్లో గుబులు రేపింది.

Shruti Haasan
డిజైనర్ శారీలో హీరోయిన్ శృతి హాసన్ సరికొత్తగా అందాల ప్రదర్శన చేసింది. నిండైన చీరలో కుర్ర గుండెలకు గాయం చేసింది. కొంటె చూపులతో మనసులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Shruti Haasan
కాగా ఈ ఏడాది శృతికి బ్లాక్ బస్టర్ ఆరంభం దక్కింది. సంక్రాంతి హీరోయిన్ గా రెండు విజయాలు నమోదు చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి.ముఖ్యంగా వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. వాల్తేరు వీరయ్యలో శ్రుతి హాసన్ రా ఏజెంట్ గా నటించడం విశేషం.
Shruti Haasan
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలలో నటించినందుకు శృతి దాదాపు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.x`
Shruti Haasan
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ మూవీపై భారీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతుంది.
Shruti Haasan
కాగా శృతి లవ్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.
Shruti Haasan
గతంలో శృతి హాసన్ లండన్ దేశస్తుడైన మైఖేల్ కోర్ల్సే ని ప్రేమించారు. శృతి హాసన్, మైఖేల్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా శృతి-మైఖేల్ విడిపోయారు. ఓ ఏడాది సింగిల్ స్టేటస్ మైంటైన్ చేసిన శృతి మరో తోడు వెతుక్కున్నారు.