`సలార్` కథని మలుపుతిప్పే కాటేరమ్మ ఫైట్‌లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? బయట చూస్తే షాక్ అవ్వాల్సిందే..
`సలార్` సినిమాలో కాటేరమ్మ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుంది. అందులో ఓ చిన్నారి డైలాగ్‌లు, యాక్టింగ్, పాట పాడే విధానం గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. మరి ఆ చిన్నారి ఎవరో తెలుసా? బయట చూస్తే వాహ్ అనాల్సిందే.
`సలార్` సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రియులంతా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ నటించిన మూవీ కావడం, ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రం కావడం, పైగా ఆడియెన్స్ ఆదరణ పొందుతుండటం విశేషం. భారీ కలెక్షన్లని రాబడుతుందీ చిత్రం. అయితే ఇందులో `కాటేరమ్మ` ఫైట్ బాగా హైలైట్ అయ్యింది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. విలన్ ఒకడు ఆ ట్రైబల్ ఏరియాలో ఆడపిల్లలను తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేస్తుంటారు. రోజుకు ఒకరు బలవుతుంటారు.
దీంతో తమ కాటేరమ్మ దేవతకు వేడుకున్నా లాభం లేదు. ఈ క్రమంలో సురభి అనే ఓ చిన్నారి రాక్షసుడైనా వస్తాడని ఆ కాటేరమ్మని మొక్కుతుంది. ఆ సమయంలో వచ్చే ఫైట్ సీన్‌లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ బాగా పాపులర్ అయ్యింది. కాటేరమ్మ రాలేదు, ఆమె కొడుకుని పంపింది అని చెప్పే డైలాగ్ థియేటర్లలో మారుమోగింది. అంతేకాదు ఆ చిన్నారి `యా.. యా.. యా.. `అంటూ ఆ ఫైట్ జరిగే టప్పుడు చేసే సౌండ్(ఓ పాట రిథమ్) ఆ ఫైట్ సీన్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. ఓ వైపు వారంతా `యా యా` అంటూ నినదిస్తుంటారు. మరోవైపు విలన్లని ప్రభాస్ ఊచకోత కోస్తుంటాడు. ఆ సమయంలో థియేటర్లలో ఆడియెన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పిస్తుంటాయి.
అయితే ట్రైబల్ లుక్‌లో కనిపించిన ఆ అమ్మాయి ఎవరనేది అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాదు ఆ చిన్నారి తాజాగా పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలిచ్చింది. ఇందులో అసలు విషయాలు పంచుకుంది. ఆ చిన్నారి మన తెలుగు అమ్మాయే కావడం విశేషం. అసలు పేరు ఫర్జానా సయ్యద్. ప్రస్తుతం జూ.10 చదువుతుంది. చిన్నప్పట్నుంచే యాక్టింగ్‌లో ఉంది. బాల నటిగా పలు యాడ్స్ చేసింది.
`మీలో ఎవరు కోటీశ్వరుడు`, `ఐపీఎల్` యాడ్, అలాగే రెనాల్ట్ కారు, స్కూల్స్ ఇలా పలు యాడ్స్ చేసింది. ఇలా యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఆమె విశ్వక్ సేన్ సినిమా `ఓరి దేవుడా`లో చైల్ట్ ఆర్టిస్ట్ గా చేసింది. హీరోయిన్‌కి చిన్ననాటి పాత్రలో మెరిసింది. దీంతోపాటు అంజలి నటించిన `ఝాన్సీ` అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ క్రమంలో ఆమెకి `సలార్`లో ఆఫర్ వచ్చిందట. `సలార్` ఆడిషన్‌కి పిలుపు వస్తే వెళ్లిందట, అందులో వందల మంది వచ్చారు. కానీ తను మాత్రం సెలెక్ట్ అయ్యిందట.
మొదట ఆఫీస్‌లో తనని ఆడిషన్ చేశారట. అందరిని పంపించి కొందరిని మాత్రమే ఉండమన్నారు. ప్రశాంత్ నీల్ సార్ వస్తారు ఉండమని చెప్పారట. కాసేపటికి ఆయన వచ్చారు. ఆయన్ని చూడగానే చాలా భయమేసిందట. కానీ తనతో మాట్లాడి, ఫ్రీ అయ్యేలా చేశాడట. ఆ తర్వాత ఆడిషన్ చేశారట. ఆడిషన్ అయిపోయిన వెంటనే ఈ అమ్మాయి ఓకే అని చెప్పాడట దర్శకుడు. దీంతో ఫుల్ హ్యాపీ.
అయితే అప్పుడు `సలార్` మూవీ అని తెలియదు, ఇది ప్రభాస్ మూవీ అని తెలియదు. సెట్‌లో షూటింగ్ అయ్యేటప్పుడు ఆ విషయం తెలిసిందట. తను చాలా లక్కీ అనుకుందట. ఆడిషన్‌కి ఇచ్చిన సీన్లే షూటింగ్‌లో చేయించారట. అలా చాలా ఈజీ అయ్యిందని తెలిపింది ఫర్జానా.
ప్రభాస్‌తో వర్క్ చేయడం గురించి చెబుతూ, చాలా హ్యాపీగా ఉందని, ప్రభాస్ సర్ సెట్‌లో చాలా కూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారని, చాలా విషయాలు మాట్లాడేవారని, క్రికెట్ గురించి కూడా చెప్పేవారని తెలిపింది. అంత పెద్ద స్టార్ అయినా సెట్‌లో ఆయన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుందని తెలిపింది ఫర్జానా. సలార్ సినిమా షూటింగ్ వండర్‌ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. అయితే సినిమాలో తన మరో సీన్ కట్ అయ్యిందని, అందులో ప్రభాస్‌తో కలిసి ఓ గేమ్ ఆడే సీన్ ఉందట. కానీ దాన్ని తీసేశారని తెలిపింది. కానీ సినిమా చూశాక, తన పాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసుకున్నాక చాలా హ్యాజీగా, ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పింది.
ఇదిలా ఉంటే సినిమాలో నల్లగా కనిపించింది ఫర్జానా. కానీ బయటకు మాత్రం ఎంతో క్యూట్‌గా ఉంది. చాలా అందంగా ఉంది. `సలార్`లో నటించింది ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోయేలా ఆమె ఉండటం విశేషం. ప్రస్తుతం ఫర్జానా సెన్సేషన్ అయ్యింది. ప్రారంభంలోనే భారీ పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం, ఆమె పాత్రకి మంచి పేరు రావడం విశేషం. ఇక ఫర్జానా లైఫ్ మారిపోయిందని చెప్పొచ్చు. దీంతోపాటు `సలార్ 2`, `కేజీఎఫ్3`లోనూ తనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పింది ఫర్జానా. చదువుకుంటూనే సినిమాలు చేస్తానని తెలిపింది.