- Home
- Entertainment
- `సలార్` ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీసుకి పూనకాలే.. టార్గెట్ 2000కోట్లు.. కమెడియన్ సప్తగిరి పోస్ట్ వైరల్..
`సలార్` ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీసుకి పూనకాలే.. టార్గెట్ 2000కోట్లు.. కమెడియన్ సప్తగిరి పోస్ట్ వైరల్..
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ప్రస్టీజియస్ మూవీ `సలార్`. దీనిపైనై ఇప్పుడు అందరి చూపు ఉంది. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసే సత్తా ఉన్న మూవీ ఇదే అని అంతా నమ్ముతున్నారు. తాజాగా కమెడియన్ సప్తగిరి ఇచ్చిన ఫస్ట్ రివ్యూ వైరల్ అవుతుంది.

ప్రభాస్ నటిస్తున్న `సలార్` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేసిది. మొదట దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్‌ని సరిగా చూపించలేదని, ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశారనే కామెంట్లు వినిపించాయి. కానీ ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్లు, ప్రభాస్ ఊచకోత వంటి సీన్లు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ టీజర్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. రెండు రోజుల్లో ఇది వంద మిలియన్ వ్యూస్‌ని దాటేసింది.
దీంతో చిత్ర బృందం దీనిపై స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంతటి వ్యూస్ పొందిన ట్రైలర్‌గా `సలార్` రికార్డులు క్రియేట్ చేయడంతో హోంబలే ఫిల్మ్స్ ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పింది. దీంతోపాటు వచ్చే నెలలో ట్రైలర్ రాబోతుందని, ఆగస్ట్ నెలని మార్క్ చేసుకుని పెట్టుకోవాలని, ఆ నెలలో అదిరిపోయే అప్‌డేట్స్ రాబోతున్నాయని చెప్పింది. ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు కమెడియన్ సప్తగిరి.
సప్తగిరి `సలార్` సినిమాలో డబ్బింగ్ పూర్తి చేసుకున్నాడట. తన డబ్బింగ్ పూర్తయ్యిందని చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాపై మరింత హైప్‌ని పెంచేశాడు. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించబోతుందని, రెండు వేల కోట్ల కలెక్షన్లని దాటిపోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు, ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ కి థ్యాంక్స్ చెప్పారు.
salaar Movie Teaser
`సలార్`పై సప్తగిరి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సింపుల్‌గా సినిమాపై హైప్ పెంచేశాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే `సలార్` టీజర్ రికార్డులను షేక్ చేస్తుంటే, ఇప్పుడు సప్తగిరి పోస్ట్ దాన్ని మరింత పెంచేస్తుంది. `కేజీఎఫ్` తరహాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కించి ఉంటే, ప్రభాస్ మార్కెట్‌కి ఇది ఇండియన్ సినిమానే కాదు, గ్లోబల్ సినిమాని సైతం షేక్ చేయడం ఖాయమంటున్నారు. మరి ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది, ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో చూడాలి.
ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. సుమారు 300కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. రెండో పార్ట్ కి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందట. ఈ లెక్కన ఏడాది గ్యాప్‌లో ప్రభాస్ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయని చెప్పొచ్చు.