Prashanth Neel : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఊహించడం చాలా కష్టమే!
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. అంత ఎదిగినా.. ఆయనను ఇన్ స్పైర్ చేసిన డైరెక్టర్ మరోకరు ఉండటం విశేషంగా మారింది.

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో ఇండియాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో అభిమానులు కూడా మాటల్లో వర్ణించడం కష్టమే.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ తో బిగ్ స్కేల్లో సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. రీసెంట్ గా ప్రభాస్ (Prabhas) ‘సలార్’ (Salaar) తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
నెక్ట్స్ ప్రశాంత్ నీల్ నుంచి ‘సలార్ 2‘, ‘ఎన్టీఆర్ 31’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమాల కోసం దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ సినిమాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar) చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఇండియాలో టాప్ డైరెక్టర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఆయన టేకింగ్ తో ఎంతో మందికి స్ఫూర్తిగానూ నిలిచారు.
ప్రశాంత్ నీల్ ను ఎంతో మంది తమ ఫేవరెట్ డైరెక్టర్ గా చెబుతున్నారు. ఈ తరుణంలో ఆయన మాత్రం తన ఫేవరేట్ డైరెక్టర్ పేరు చెప్పి షాకిచ్చారు. ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేరంటూ ఆకాశానికి ఎత్తారు.
మరి ఆయన ఫేవరెట్ డైరెక్టర్ మరెవరో కాదు.. కన్నడ హీరో, దర్శకుడు ఉపేంద్ర (Upendra) అని చెప్పారు. ఏ, ఓమ్, ష్, ఉపేంద్ర వంటి సినిమాలతోనూ హిట్ కోట్టడం సెన్సేషన్ అన్నారు. నెక్ట్స్ ఆయన నుంచి యూఐ (UI) మూవీ రాబోతోంది.