- Home
- Entertainment
- 32 ఏళ్ళలో కేవలం 10 సినిమాలు మాత్రమే హిట్, కానీ ₹1200 కోట్ల ఆస్తులున్న హీరో ఎవరో తెలుసా?
32 ఏళ్ళలో కేవలం 10 సినిమాలు మాత్రమే హిట్, కానీ ₹1200 కోట్ల ఆస్తులున్న హీరో ఎవరో తెలుసా?
ఈ బాలీవుడ్ స్టార్ హీరో మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. సక్సెస్ రేట్ చాలా తక్కువే. కానీ బాలీవుడ్ రిచ్చెస్ట్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన ఎవరు? ఆ కథేంటో చూద్దాం.

55 ఏళ్ళ నటుడు, 32 ఏళ్ళుగా సినిమాల్లో స్టార్‌గా రాణిస్తున్న హీరో
మనం మాట్లాడుకుంటున్నది చోటే నవాబ్ సైఫ్ గురించి. 55 ఏళ్ళ సైఫ్ 1993లో 'పరంపర'తో కెరీర్ ప్రారంభించారు. 32 ఏళ్ళ కెరీర్‌లో సైఫ్ కేవలం 10 హిట్ చిత్రాలనే ఇచ్చారు. 68 సినిమాల్లో నటించిన ఆయన హిట్ చిత్రాలు 'హమ్ సాత్-సాత్ హై', 'క్యా కెహనా', 'కల్ హో నా హో' వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇలా కేవలం పదిసినిమాలతోనే విజయాలు అందుకున్న సైఫ్ ఇప్పటికీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.
KNOW
`దేవర`, `ఆదిపురుష్`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన సైఫ్
శనివారం(ఆగస్ట్ 16న) తన పుట్టిన రోజు జరుపుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవల తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి `దేవర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీలో నెగటివ్ రోల్ చేశారు సైఫ్. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. `దేవర 2`లోనూ ఆయన నటించాల్సి ఉంది. కానీ ఆగిపోయినట్టు సమాచారం. దీంతోపాటు ప్రభాస్ హీరోగా నటించిన `ఆదిపురుష్`లోనూ రావణ్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు సైఫ్ అలీ ఖాన్.
సైఫ్ అలీ ఖాన్ నికర విలువ ఎంత?
మహారాష్ట్రలోని పటౌడీ నవాబ్‌ల(రాజుల కుటుంబం) ఫ్యామిలీ నుంచి వచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఆనాటి నవాబ్‌ల వారసుడిగా రాణిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో రిచ్చెస్ట్ స్టార్‌గా రాణిస్తున్నారు. సైఫ్ వద్ద ₹1200 కోట్ల ఆస్తి ఉంది. ₹800 కోట్ల విలువైన పటౌడి ప్యాలెస్ కూడా ఉంది. ఇవే కావు వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం. అయితే వాటిని ప్రభుత్వం టేకోవర్ చేసినట్టు టాక్.
సైఫ్ అలీ ఖాన్ పారితోషికం, స్టడీస్ వివరాలు
సైఫ్ కి వారసత్వ ఆస్తులున్నప్పటికీ తన సొంత ఆదాయం మీదనే ఆధారపడతారు. సినిమాల ద్వారానే ప్రధానంగా సంపాదిస్తున్నారు. ఆయన ఒక్కో సినిమాకు ₹10-15 కోట్ల పారితోషికం తీసుకుంటారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తారు. నిర్మాణ సంస్థలు, పెట్టుబడులు, ఫ్యాషన్ బ్రాండ్, రెస్టారెంట్ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. సైఫ్ ప్రాథమిక విద్య సనవర్‌లోని లారెన్స్ స్కూల్‌లో, తదుపరి విద్య యూకేలోని లాకర్స్ పార్క్ స్కూల్‌లో, గ్రాడ్యుయేషన్ యూకేలోని విన్చెస్టర్ కాలేజీలో పూర్తి చేశారు.
సైఫ్ అలీ ఖాన్ భార్య, పిల్లలు
సైఫ్ అలీ ఖాన్ మొదట(1991)లో అమృతా సింగ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహిం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2012లో హీరోయిన్ కరీనా కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.