- Home
- Entertainment
- Sai Pallavi Glam pics: క్యూట్ లుక్‌లో హంట్ చేస్తున్న సాయిపల్లవి.. `శ్యామ్‌సింగరాయ్` ఈవెంట్‌లో కన్నీళ్లు
Sai Pallavi Glam pics: క్యూట్ లుక్‌లో హంట్ చేస్తున్న సాయిపల్లవి.. `శ్యామ్‌సింగరాయ్` ఈవెంట్‌లో కన్నీళ్లు
సహజమైన నటనకు, సహజమైన డాన్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న సాయిపల్లవి క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తుంది. కుర్రాళ్లని గిలిగింతలు పెడుతుంది. ఇప్పుడు వైరల్ అవుతుంది.

సాయిపల్లవి ప్రస్తుతం నానితో కలిసి `శ్యామ్‌సింగరాయ్` చిత్రంలో నటిస్తుంది. పీరియాడిక్ టైమ్‌లో నానికి జోడిగా కనిపిస్తుంది సాయిపల్లవి. ఆమె దేవదాసి పాత్రని పోషిస్తుండటం విశేషం. వీరి కథే సినిమాలో ప్రధానంగా ఉండబోతుంది. కృతి శెట్టి మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. దీంతో శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర `శ్యామ్‌సింగరాయ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సాయిపల్లవి మరింత గ్లామరస్‌గా కనిపిస్తూ కనువిందు చేస్తుంది.
మరోవైపు ఈ చిత్రంలో సాయిపల్లవి అద్భుతమైన డాన్సులతో మెప్పించింది. సాయిపల్లవి మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే. కానీ ఇందులో మాత్రం ఆమె మరో లెవల్ డాన్సులను చూపించింది.
`ప్రణవాలయ` పాటలో ఆమె నాట్య విశ్వరూపించిందని చెప్పొచ్చు. అద్భుతమైన హవాభావాలు, డాన్సులతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ఇందులో సాయిపల్లవి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. బలమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దేవదాసిగా ఉన్న ఆమె ఎవరికీ దాసి కాదని, చివరికి ఆదేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఆ వృత్తి నుంచి శ్యామ్ సింగరాయ్ విముక్తి కలిగిస్తాడని తెలుస్తుంది.
`శ్యామ్ సింగరాయ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు. ఆమె ఈ చిత్రంలో `ప్రణవాలయ` పాటలో అద్భుతంగా డాన్సు చేసిన విషయంతెలిసిందే. అదే పాటని స్టేజ్‌పై ఆలపించారు. ఇందులో నర్తించిన సాయిపల్లవిపై అందరు ప్రశంసలు కురిపించారు. నాట్య విశ్వరూపం చూపించిన సాయిపల్లవి డాన్సులను ప్రశంసించారు. ఆ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ నేపథ్యంలో అవన్ని గుర్తు చేసుకుంటూ సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు. అభిమానులు తనని ఫిదా అని, భానుమతి అంటూ పిలవడంతో పల్లవి ఆనందం తట్టుకోలేకపోయింది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అందరికి సినిమాల్లోకి రావడానికి అదృష్టం ఉండదు, చాలా మంది ఎంతో ట్రై చేస్తారు. కానీ కొందరికి ఆ ఛాన్స్ దక్కుతుంది. ఆ విషయంలో నాకు ఈ ఛాన్స్ దక్కినందుకు, తాను ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. తాను లక్కీగా భావిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశాలివ్వడం, నన్ను ప్రోత్సహించడం అంతా ఓ గాడ్ గిఫ్ట్ గా భావిస్తున్నా.
జనరల్‌గా ఓ అస్కార్ అవార్డు దక్కుతేనో ఇలాంటి స్టేజ్ ఎమోషనల్ అవుతాం. కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ నాకు ఇప్పుడే వస్తున్నాయి. ఎందుకుంటే నా వరకు నేను ఇండస్ట్రీలో ఉండటమే, మీ ప్రేమాభిమానాలు పొందడమే ఆస్కార్ అవార్డు దక్కినట్టుగా అనిపిస్తుంది. పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి డాన్సు చేశానని అంటున్నారు. కానీ నాకు గుర్తు లేదు, ఏం హార్డ్ వర్క్ చేశాను. నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇవన్నీ కుదిరాయంటే మీరందరు నన్ను యాక్సెప్ట్ చేయడం వల్లే. ఫస్ట్ మూవీ తర్వాతనే అరే ఈ అమ్మాయిఎందుకు అనుకుంటే ఈ ఛాన్స్ వచ్చేది కాదు, అలా నటించే దాన్నికాదు. ఇలాంటి స్టేజ్ ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్, అందరు దర్శకులకు ధన్యవాదాలు` అంటూ ఎమోషనల్ అయ్యింది సాయిపల్లవి.
సాయిపల్లవి క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ లేటెస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ లేటెస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ లేటెస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ లేటెస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ లేటెస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.