Pooja Kannan : సాయిపల్లవి చెల్లి ఎంగేజెమెంట్ కు ఏర్పాట్లు... ఎప్పుడో తెలుసా? ఫొటోస్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ Pooja Kannan పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారింట్లో పెళ్లి సందడి మొదలైందని ఫొటో షేర్ చేస్తూ పూజా అప్డేట్ ఇచ్చింది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallaviకి అచ్చం తన పోలికలతోనే ఉన్న చెల్లి ఉన్న విషయం తెలిసిందే. ఆమె పేరు పూజా కన్నన్ Pooja Kannan. ప్రస్తుతం తను కూడా హీరోయిన్ గా అలరిస్తోంది.
2021లో విడుదలైన ‘చిత్తిరాయి సెవ్వానం’ అనే చిత్రంతో హీరోయిన్ గా అలరించింది. సముద్రఖనికి కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజా కన్నన్ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అక్క సాయిపల్లవితో కలిసి ఫొటోలకూ ఫోజులిస్తూ సందడి చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తన ప్రియుడి గురించి చెప్పింది.
తన ప్రియుడు వినీత్ తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కూడా అప్డేట్ ఇచ్చింది. అక్కకు పెళ్లి కాకుండానే చెల్లి పెళ్లిపీటలు ఎక్కుతుండటం విశేషం. మొత్తానికి రీసెంట్ పెళ్లి మేటర్ ను లీక్ చేసింది.
తాజాగా తన పెళ్లిపై మరో అప్డేట్ ఇచ్చింది. ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు రెడీ అని చెప్పింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేసింది. అక్క సాయిపల్లవితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. చేతులకు మెరిసిపోతున్న మెహందీని కూడా చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
రేపు సాయిపల్లవి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడనేది తెలియలేదు. డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సాయిపల్లవి ఇంట్లో జరగబోతున్న తొలి శుభకార్యం ఇదే కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.