- Home
- Entertainment
- Sai Pallavi: క్యాష్ షోలో రచ్చ రచ్చ చేసిన సాయి పల్లవి.. పవన్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..
Sai Pallavi: క్యాష్ షోలో రచ్చ రచ్చ చేసిన సాయి పల్లవి.. పవన్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..
సాయి పల్లవి, రానా జంటగా నటించిన విరాట పర్వం చిత్రం మరో మూడు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. అందంగా హావ భావాలు పలికిస్తూ ఎమోషనల్ గా ప్రేక్షకులని కట్టి పడేస్తూ సాయి పల్లవి ఓ ప్రత్యేకమైన హీరోయిన్ గా మారిపోయింది.
సాయి పల్లవి, రానా జంటగా నటించిన విరాట పర్వం చిత్రం మరో మూడు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా సాయి పల్లవితో పాటు విరాట పర్వం టీం యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు. తాజాగా క్యాష్ ప్రోమో రిలీజై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫుల్ ఎపిసోడ్ జూన్ 18న టెలికాస్ట్ కానుంది. ఇక ప్రోమో చూస్తుంటే సుమతో కలసి సాయి పల్లవి రచ్చ రచ్చ చేసింది. సాయి పల్లవి చిరునవ్వులు చిందిస్తూ షోలోకి ఎంటర్ అయింది. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు.. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎలా సాధ్యం అని సుమని సాయి పల్లవి ప్రశ్నించింది. అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ నావే అంటూ సుమ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.
సాయి పల్లవి తో పాటు నవీన్ చంద్ర, దర్శకుడు వేణు ఊడుగుల కూడా హాజరయ్యారు. నవీన్ చంద్ర రాగానే సుమ అతడికి పేట్రోల్ బాటిల్ ఇచ్చింది. మీరు ఫైర్ కాబట్టి సింబాలిక్ గా పెట్రోల్ బాటిల్ ఇచ్చినట్లు తెలిపింది. దీనితో తాగితే ఇంకా స్పీడ్ గా పరిగెడతామేమో అని నవీన్ చంద్ర అంటాడు.
దీనికి సుమ సమాధానం ఇస్తూ..వద్దు బాబోయ్ ఒకళ్ళు ఎదో చేస్తేనే పెద్ద కాంట్రవర్సీ అయింది. మరోసారి మీరు ఆ పెట్రోల్ తో ఇంకేం చేయవద్దు అని అంటుంది. కామెడీ పంచ్ లు, జోకులతో ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్లు అనిపిస్తోంది.
అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోని డిస్ ప్లే చేయగానే సాయి పల్లవి సంతోషంలో మునిగిపోతోంది. పవన్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలిపింది. ఆయన ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ ఎప్పుడూ అలా ఉండరు. సాధారణ మనిషి లాగే వెళ్లిపోతుంటారు. తన హార్ట్ లో ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అని సాయి పల్లవి పేర్కొంది.
ఇక క్యాష్ షోలోకి వచ్చిన ఒక స్టూడెంట్ మాట్లాడుతూ.. మీకు ఎలా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అని ప్రశ్నిస్తాడు. ఫీల్ అయ్యే విధంగా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాను అని సాయి పల్లవి బదులిస్తుంది. చివర్లో సాయి పల్లవి 'వచ్చిండే' సాంగ్ కి డాన్స్ చేసి ఉర్రూతలూగించింది.