- Home
- Entertainment
- నిహారిక పర్సనల్ లైఫ్ పై నెటిజన్ కామెంట్.. నోరు మూసుకో, దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన తేజు
నిహారిక పర్సనల్ లైఫ్ పై నెటిజన్ కామెంట్.. నోరు మూసుకో, దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన తేజు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం తర్వాత కోలుకుని విరూపాక్ష చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత తేజు పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం తర్వాత కోలుకుని విరూపాక్ష చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత తేజు పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ మావయ్యతో కలసి నటించాననే సంతోషంలో తేజు ఉన్నాడు.
అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ తన స్నేహితుడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ కోసం ఓ ప్రయివేట్ సాంగ్ లో నటించాడు. స్వాతి రెడ్డితో కలసి సత్య అనే వీడియో సాంగ్ లో నటించారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సాంగ్ విషయంలో ఊహించని విధంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వార్తల్లో నిలిచింది.
కొద్దిరోజుల క్రితం ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ తేజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి నిహారిక రిప్లై ఇస్తూ ఈ సాంగ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది. ఓ ఆకతాయి నెటిజన్ నిహారిక కామెంట్ కి బదులిస్తూ ఆమె పర్సనల్ లైఫ్ ని టచ్ చేశాడు. ఏమాత్రం సంబంధం లేని విధంగా నిహారిక గురించి కామెంట్ పెట్టాడు.
'వీటిపైన పెట్టిన ద్యాస ఫ్యామిలీపై పెట్టుంటే బావుండేది అంటూ నిహారిక వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించాడు. దీనితో సాయిధరమ్ తేజ్ కి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తేజు స్పందించాడు. నోరు మూసుకో.. వెంటనే కామెంట్ డిలీట్ చెయ్ అంటూ ఆ ఆకతాయికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు. తేజు ఫాన్స్ కూడా సదరు నెటిజన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. సంస్కారం లేని వాళ్లే ఇలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరదలికి బావ అండగా నిలబడడంతో తేజుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సదరు నెటిజన్ ఆ కామెంట్ ని వెంటనే డిలీట్ చేశాడు. దీనితో తేజు కూడా తన వార్నింగ్ ని రిమూవ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నిహారిక కొన్ని రోజుల క్రితం చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిహారిక సినిమాలు వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది. ఇక తేజు యాక్సిడెంట్ తర్వాత ఫిట్ నెస్ కోల్పోయాడు. విరూపాక్ష, బ్రో చిత్రాల్లో అది కనిపించింది. దీనితో కొంత గ్యాప్ తీసుకుని ఫిట్ నెస్ సాధించి తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు.