కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారు.. బాడీలో ఇంకా ఇబ్బంది ఉంది, సాయిధరమ్ తేజ్ కామెంట్స్
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది మరోసారి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఆ మధ్యన వచ్చిన విరూపాక్ష చిత్రంతో తేజుకి గ్రాండ్ రీ ఎంట్రీ లభించింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది మరోసారి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఆ మధ్యన వచ్చిన విరూపాక్ష చిత్రంతో తేజుకి గ్రాండ్ రీ ఎంట్రీ లభించింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తేజు తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు.
మామ అల్లుళ్ళు కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
అయితే సాయిధరమ్ తేజ్ లో మునుపటి డ్యాన్స్ మూమెంట్స్, ఆ హుషారు కనిపించడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై తేజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. బైక్ ప్రమాదం తర్వాత తేజు ఒకరకంగా పునర్జన్మ పొందారు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల బాడీలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని తేజు తెలిపాడు.
#Bro
ఇప్పుడు నా డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు నేను కూడా నిరాశ పడ్డాను. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడ్డాయి. అలాగని నేను సాకు చెప్పను. తప్పకుండా ఫ్యాన్స్ కోరుకునే విధంగా మునుపటికంటే ధీటుగా డ్యాన్స్ చేయగలను. కాకపోతే హీల్ కావడానికి కొంత టైం పడుతుంది. ఫిజికల్ గా మూవ్ కావడం మాత్రమే కాదు బాడీ లో కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి..
యాక్సిడెంట్ తర్వాత కనీసం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు దానిని అధికమించాను. అసలు ప్రాబ్లం యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్ల కాదు. కోమాలో ఉన్నప్పుడు నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఆ స్టెరాయిడ్స్ నా బాడీపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయాను. తిరిగి ఫిట్ నెస్ గైన్ చేయాలి. ప్రస్తుతం దానిమీద వర్క్ చేస్తున్నా.
స్టెరాయిడ్స్, ఇతర మెడిసిన్స్ వల్ల పూర్తిగా వర్కౌట్స్ చేయలేకున్నా. త్వరలోనే దీనిని అధిమించి మునుపటికంటే బాగా డ్యాన్స్ చేస్తా ఇది నా ప్రామిస్ అని తేజు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తదుపరి సంపత్ నంది దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ చిత్రం చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకా టైం పడుతుంది. 'బ్రో' తర్వాత తాను 6 నెలలు బ్రేక్ తీసుకుని బాడీ ఫిట్ నెస్, ఇతర సమస్యలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తేజు వివరించాడు.